Wednesday, May 15, 2024
- Advertisement -

సుజన చౌదరి మానం వెనుక కారణం ఆయనేనా…?

- Advertisement -

సుజనా చౌదరి రాజకీయాలు ఎలా ఉంటాయి అందరికి తెలిసిందే. చంద్రబాబు దగ్గర శిష్యరికం చేసి వచ్చిన సుజనా కాస్త అటుఇటుగా చంద్రబాబు ఆలోచించే ధోరణినే, అవలంభించే పద్ధతినే అవలంభిస్తుంటారు.ఇటీవలే బీజేపీ లోకి వెళ్లిన సుజనా అక్కడ కూడా పార్టీ లో కొన్ని రాజకీయాలు చేసి పైకి రావాలని చూస్తున్నారట.. వాస్తవానికి రాష్ట్ర బీజేపీ పేరున్న లీడర్ ఎవరు లేరు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేరిక తో పవన్ రూపంలో ఓ పేరున్న నాయకుడు బీజేపీ కి దొరికినా ఆయన తరువాత ఏ నాయకుడు ప్రజల్లో అంతగా చొచ్చుకుపోలేదు..

దాంతో టీడీపీ లో తనకున్న ఫేమ్ తో బీజేపీ లో ముఖ్యమంత్రి ప్లేస్ కి వెళ్లాలన్న ఉద్దేశ్యంతో పార్టీ లోని ఇతర నేతలను తొక్కేసే విధంగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని కన్నా లక్ష్మి నారాయణ హయాంలో ఈ ధోరణి ని ఎక్కువ కనబరిచిన సుజనా సోము వీర్రాజు వచ్చాక ఆయన ఆటలు సాగనీయడం లేదని అందుకే సుజనా పేరు ఎక్కువగా వినపడడం లేదని తెలుస్తుంది. వాస్తవానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం జరిగిన దగ్గర నుంచి సుజనా చౌదరి పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. మరి రాష్ట్రంలో చర్చకు రావాల్సిన అంశాలు ఏవీ లేవా అంటే బోలెడు ఉన్నాయి.. అయినా సుజనా చౌదరి మాత్రం మౌనంగా ఉండటానికి కారణాలేంటన్న చర్చ కమలం పార్టీలో జరుగుతుంది.

ఇక వచ్చి రాగానే సోము సుజనా ను చాలా విషయాల్లో తప్పుపట్టారు.. ఆయన మాటలకు విలువ లేదని చెప్పకనే చెప్పారు. ఇక సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో జరిగిన కార్యక్రమానికి సుజనా చౌదరి డుమ్మా కొట్టారు. ఈయనతో పాటు కామినేని శ్రీనివాస్ కూడా గైర్హాజరవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీంతో వీరి మధ్య వీరి మధ్య వైరం పెరుగుతుందని అర్ధమవుతుంది. ఇటీవలే జీవీఎల్ నరసింహారావుపైన కూడా సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు వచ్చాయి. దీనికి సుజనా సహకరించారన్న ఆరోపణలున్నాయి. ఇలా బీజేపీ లో ఎప్పటినుంచో ఉన్న నేతలపై నిన్న మొన్న వచ్చిన టీడీపీ నాయకుడు పెత్తనం చెలాయించడం వారికి రుచించట్లేదు.. మరి సుజనా ఈ పార్టీ లోనైనా కడదాకా ఉంటాడా అనేది చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -