Wednesday, May 15, 2024
- Advertisement -

రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌…..

- Advertisement -

రాయ‌ల‌సీమ‌లో భైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంద‌రికి సుప‌ర చితుడే. తాజాగా భైరెడ్డి తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న స్థాపించిన రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ సమితిని మూసి వేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇదే ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రాయలసీమ పరిరక్షణ పార్టీని 2013లో బైరెడ్డి రాజశేఖరరెడ్డి స్థాపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 2013 జులై 30న తీర్మానం వెలువడిన అనంతరం ఆర్పీఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాంతీయ తత్వ భావజాలంతో ఏర్పాటు చేసిన ఈ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఏపీలోని కర్నూలులో ఉంది.

రాయలసీమ ప్రజా సమితి నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి భవిష్యత్‌ కార్యాచరణ చర్చించేందుకు మంగళవారం ముచ్చుమర్రిలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలంద‌రూ హాజ‌ర‌య్యారు. అంద‌రితో చ‌ర్చించి రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

నంద్యాల ఫలితం వచ్చిన తర్వాత సినీ నటుడు బాలకృష్ణ, మంత్రి పరిటాల సునీత సమక్షంలో బైరెడ్డి రాజశే‌ఖర్‌రెడ్డి చర్చించారని సమాచారం. టిడిపిలో చేరేందుకు బైరెడ్డి ఆసక్తిని చూపారని సమాచారం. టీడీపీలో చేరేందుకు బైరెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. బైరెడ్డి టీడీపీలో చేరితే తమకు న్యాయం జరుగుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

గ‌త కొంత‌కాలంగా భైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి భాజాపా కూడా గాలం వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. పార్టీలోకి వ‌స్తె రాయ‌ల‌సీమ ప్రాంత బాధ్య‌త‌లు అ్ప‌ప‌గించాల‌ని చూస్తున్నారు క‌మ‌లం నాయ‌కులు. వైసీపీలోకి వ‌చ్చినా ..శిల్పా బ్ర‌ద‌ర్స్‌,గౌరు వెంక‌ట్‌రెడ్డి వ‌ర్గాల‌తో పొసిగే ప‌రిస్థితుల‌లేవు. టీడీపీలోకి వెల్లేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

బైరెడ్డి రాజకీయ కార్యాచరణ ప్రకటించేందుకు సభ ఏర్పాటు చేస్తుండడంతో నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీలోకి వస్తే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకుల పరిస్థితి ఏమిటన్న దానిపై చర్చ జరుగుతుంది. ఏ పార్టీలో చేరే విషయాన్ని తాను త్వరలో ప్రకటిస్తానని అన్నారు. ఆయన ప్రకటన కోసం నియోజకవర్గ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -