- Advertisement -

తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్‌!

- Advertisement -

సూర్యాపేట జిల్లాలో భారీ బియ్యం కుంభకోణం వెలుగుచూసింది. తీన్మార్ మల్లన్న పార్టీ (TRP) నేత వట్టె జానయ్య యాదవ్‌కు చెందిన రైస్ మిల్లుల నుంచి సుమారు రూ. 73 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో జానయ్య యాదవ్‌తో పాటు మరో ఇద్దరిపై పోలీసు కేసులు నమోదయ్యాయి.

సూర్యాపేట జిల్లా బాలెంల పరిధిలోని ‘వజ్ర రైస్ కార్పొరేషన్’, ‘వజ్ర వికాస్ రైస్ మార్ట్’లలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మిల్లుల నుంచి ఏకంగా 29,188 టన్నుల వడ్లు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు.

భారత ఆహార సంస్థ (FCI)కి పంపించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) నిల్వలను పక్కదారి పట్టిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ ధాన్యాన్ని ముదిగొండలోని ‘సత్యసాయి రైస్ కార్పొరేషన్’ పేరుతో అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పక్కా సమాచారంతో దాడులు చేసి లారీలను స్వాధీనం చేసుకున్నారు.

రూ. 73 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని మాయం చేసి, అక్రమ రవాణాకు పాల్పడినందుకు గానూ ప్రధాన నిందితుడు, TRP నేత వట్టె జానయ్య యాదవ్ తో పాటు రేణుక, గణేష్ అనే మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ భారీ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. మరి దీనిపై తీన్మార్ మల్లన్న ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -