Sunday, May 19, 2024
- Advertisement -

వ‌ల‌స‌ల‌ను ఆప‌డం టీడీపీ త‌ర‌మా….?

- Advertisement -

ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ చేస్తున్న పాదయాత్ర మంగళవారం విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. పార్టీనాయ‌కులు, పార్టీ శ్రేణులు జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఉత్త‌రాంధ్ర‌లోకి జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌వేశించ‌డంతో టీడీపీ నేత‌ల్లో ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి. జగన్ ప్రభంజనం ఇక్కడ అధికార పార్టీని ఒక కుదుపు కుదుపుతోంది.

ఇప్ప‌టికే టీడీపీనుంచి అనేక‌మంది నేత‌లు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.ఉత్త‌రాంధ్ర‌లోకూడా వైసీపీలోకి భారీగా వ‌ల‌స‌లు ఉండ‌నున్నాయి. మాజీ, తాజా ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు చాలామంది వైసీపీలో చేరెందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు స‌మాచారం.

టీడీపీనుంచి మ‌రో వికెట్ ప‌డ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మంత్రి సోద‌రుడు వైసీపీ కండువా క‌ప్పుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. మంత్రిసోద‌రుడుతోపాటి ఓఎంపీ కూడా పార్టీలో చేరే విష‌యంలో ఊగిస‌లాడుతున్న చివరకు ఇటే వస్తారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీనీ బ‌ల‌హీన‌ర‌ప‌రిచేందుకు విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి రాజ వంశాన్ని వైసీపీ నుంచి టీడీపీలోకి తెచ్చామని మురిసిపోతున్న పసుపు పార్టీకి షాక్ తగిలే పరిణామం ఒకటి జరగబోతోంది. జిల్లా మంత్రి సుజయ క్రిష్ణ రంగా రావు సోదరుడు బేబీ నాయన తిరిగి వైసీపీ గూటికి చేరుతారని టాక్ నడుస్తోంది. ఈ పరిణామాలు టీడీపీలో ప్రకంపనలు స్రుష్టిస్తున్నాయి. మంత్రి కుటుంబం నుంచే వలసలు మొదలైంతే ఇక పార్టీ నాయకులను ఆపడమెలా అన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది.

ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఓ ఎంపీ వైసీపీ లో చేరేందుకు దాదాపుగా డిసైడ్ అయ్యారు. అయితే చివరి నిముషంలో చంద్రబాబు జోక్యం చేసుకుని బ్రేక్ వేశారని భోగట్టా. జగన్ దాదాపు మూడు నెలల పాటు ఇక్కడె ఉండబోతున్నారు. అందువల్ల ఆయనతో సహా టీడీపీలోని పలువురు పెద్ద తలకాయలు కూడా ఫ్యాన్ నీడకు వస్తారని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -