Wednesday, May 15, 2024
- Advertisement -

మోదుగుల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న జ‌గ‌న్‌…టీడీపీకీ క‌ష్ట‌మే..

- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ అయినటువంటి టీడీపీ నుంచి వైసీపీ లోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు, ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు జగన్ సమక్షం లో పార్టీ ఖండువా కప్పుకున్నారు. తాజాగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయ‌న ఈనెల 9న వైసీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

వైసీపీలో చేరాలా వ‌ద్దా అన్న దానిపై కొంతకాలంగా ఊగిసలాట ధోరణితో వ్యవహరిస్తున్న మోదుగుల మంగళవారం తన నిర్ణయాన్ని బహిర్గత పరిచారు. ఈనెల 9న వైసీపీలో చేరేందుకు ముహుర్తం ఖరారుచేసుకున్న మోదుగుల టీడీపీకి వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు అధినేత చంద్రబాబునాయుడుకు లేఖ పంపారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నట్లు శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుకు లేఖ పంపారు.

గుంటూరు లోక్ సభ సీటు పరిధిలోని అసెంబ్లీ సీట్లకు జరిగిన రివ్యూ మీటింగ్ కు కూడా మోదుగుల హాజరు కాలేదు. తన కార్యాలయానికి నియోజకవర్గానికి చెందిన డివిజన్‌ పార్టీ అధ్యక్షులను పిలిపించుకొని మోదుగుల అత్యవసర సమావేశం నిర్వహించారు. టీడీపీలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఉన్నాయ‌ని అందుకే వైసీపీలో చేరుతున్నాని…ఇష్టమైన వారు తనతో పాటు వైసీపీలోకి రావచ్చని ఆహ్వానించారు. మ‌రో వైపు మోదుగుల పార్టీని వీడిన‌ట్లేన‌ని ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా ప్ర‌క‌టించారు. వైసీపీ అధినేత జగన్‌తో అత్యంత సన్నిహితంగా ఉంటున్న తన బావ ఆళ్ళ ఆయోధ్యరామిరెడ్డి ఒత్తిడి కూడా ఉండటంతో రాజీనామా చేసి వెళుతున్నట్లు చెప్పారు.

మోదుగుల పోటీ చేసె విష‌యంలో జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న్ని గుంటూరు జిల్లాలో టీడీపీకీ కంచుకోట అయిన పొన్నూరు నుంచి వైసీపీ త‌రుపున బ‌రిలోకి దింపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అక్క‌డ‌నుంచి టీడీపీ త‌రుపున ధూలిపాళ్ల న‌రేంద్ర నాలుగు సార్లు గెలిచారు. ప్ర‌స్తుం ఇప్పుడు ఆయ‌న మీద ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. టీడీపీ కంచుకోట‌గా ఉన్న పోన్నూరులో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీకి దిగితే హోరా హోరీ ఖాయ‌మ‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ తీసుకున్న ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం ఇప్పుడు టీడీపీలో గుబులు రేపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -