Friday, May 17, 2024
- Advertisement -

ప్ర‌కాశం జిల్లాలో టీడీపీకీ మ‌రో బిగ్ షాక్‌… వైసీపీలో చేర‌నున్న మాగుంట

- Advertisement -

ఎన్నిక‌ల వేల చంద్ర‌బాబు అవ‌స్త‌లు అన్నీ ఇన్నీ కావు. ఒక వైపు టికెట్ల లొల్లి పంచాయితీ…మ‌రో వైపు సీనియ‌ర్ నేత‌లంతా పార్టీ వీడుతున్నారు. దీంతో బాబు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. వ‌స‌ల‌ను ఆపాల‌ని బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు బెడిసి కొడుతున్నాయి. మంత్రుల‌ను పంపి రాయ‌బారాలు న‌డిపినా స‌ద‌రు నేతలు స‌సేమీరా అంటున్నారు. పార్టీ మారేందుకే మొగ్గు చూపుతున్నారు. తాజాగా ప్ర‌కాశం జిల్లాలో ప‌చ్చ‌పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి, పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు పంపారు.

త్వ‌ర‌లో వైసీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తన అనుచరులతో సమావేశానంతరం వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. వైఎస్‌తో ఉన్న అనుబంధంతోనే వైసీపీలో చేరుతున్నానని ఆయన తెలిపారు. వైసీపీ తరఫున ఆయన ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అక్కడ సిట్టింగ్ ఎంపీ, జగన్‌మోహన్ రెడ్డికి బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డిని తప్పించి ఆయన స్థానంలో మాగుంటను బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం.

తనకు చంద్రబాబుతో 37 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. తనకు ఆయన ఎంతో సహకరించారని.. తాను ఎంపీగా ఓడినా కూడా ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం ఇచ్చారని మాగుంట కొనియాడారు.పార్టీని వీడే ముందు పార్టీఅధ్య‌క్ష‌న్ని, పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌డం నాయ‌కుల‌కు అల‌వాటు. కాని మాగుంట మాత్రం బాబును పొగ‌డ‌టం గ‌మ‌న‌ర్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -