Tuesday, April 30, 2024
- Advertisement -

మాగుంటకు లైన్ క్లియరేనా!

- Advertisement -


వైనాట్ 175..వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. గెలుపే ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లను మార్చగా మరికొంతమంది ఎంపీలకు సైతం సీటను నిరాకరించారు.

ఇక వచ్చే నెలలో ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా ఈ స్థానాలకు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులును రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. సామాజిక సమీకరణాల ఆధారంగా రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేశారు. గొల్ల బాబురావు ఎస్సీ సామాజికవర్గం కాగా బీసీ సామాజికవర్గం నుంచి అరణి శ్రీనివాసులు, ఓసీ సామాజిక వర్గం సుబ్బారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

ఇక వైవీని పెద్దల సభకు పంపడం ద్వారా ఒంగోలు పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి లైన్ దాదాపు క్లీయర్ అయినట్లే. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి…వైసీపీ అధిష్టానంతో చర్చలు జరిపారు. ఒంగోలులో ఎంపీ మాగుంటకు టికెట్ ఇస్తేనే…తాను ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తానని సీఎం జగన్ కు చెప్పారట. దీంతో వైవీని పెద్దల సభకు పంపి ఒంగోలు స్థానాన్ని మాగుంటకే కన్ఫామ్‌ చేసినట్లు టాక్ నడుస్తోంది. మొత్తంగా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు జగన్ మాస్టర్ స్కెచ్‌ వేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -