Tuesday, May 14, 2024
- Advertisement -

టీడీపీ నుంచి మ‌రో వికెట్ డౌన్‌… వైసీపీ గూటికి టీడీపీ ఎమ్మెల్సీ…

- Advertisement -

సాదార‌న ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ చంద్ర‌బాబుకు షాక్‌లు త‌గులుతున్నాయి. ఆప‌రేష‌న్ ఆక‌ర్శ‌లో భాగంగా వైసీపీకీ చెందిన ఇద్ద‌రు ఎంపీల‌తో పాటు 23 మంది ఎమ్మెల్యేల‌కు ప‌చ్చ కండువా క‌ప్పేశారు. కాని ఆయా నియోజ‌క వ‌ర్గాల్లో క్షేత్ర స్థాయిలో పార్టీ ప‌టిష్టం కాక పోగా ప్ర‌జ‌ల‌నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. పార్టీ మారిన ఫిరాయింపులు ఇప్పుడు టీడీపీలో ఇమ‌డ‌లేక పోతున్నారు. వారిలో చాలా మందికి టికెట్లు కూడా వ‌చ్చే అవ‌కాశంలేదు.

కొన్ని చోట్ల కొత్త, పాత నేతల మధ్య‌ ఏ మాత్రం పొసగ‌టం లేదు. ఉదాహరణకు అద్దంకి పరిస్థితే చూస్తే అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు గత ఎన్నికల్లో రవి చేతుల్లో ఓడిన కరణం మధ్య‌ ఎలాంటి యుద్ధం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాబు, లోకేష్‌లు ఇద్ద‌రూ ర‌వికి స‌పోర్ట్ చేయ‌డంతో క‌ర‌ణం ఏం చ‌యాలో తెలియ‌క దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో ఉన్నారు.

తాజాగా బాబుకు షాక్ ఇస్తూ టీడీపీ ఎమ్మెల్సీ ప్యాన్ కింద‌కు చేర‌నున్నారు. ఒంగోలు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మరో సారి ఎంపీగా టీడీపీ నుంచి పోటీకి రెడీ అవుతున్న మాగుంట అభిప్రాయాలను కొండపి, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పట్టించుకోవడం లేదని మాగుంట సీరియస్‌గా ఉన్నారంట‌.

మ‌రో వైపు ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం టీడీపీలో ఉన్న లీడ‌ర్లు మాగుంటను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పార్టీ మారిన మాగుంటకు జగన్‌ ఒంగోలు ఎంపీ సీటు ఆఫర్‌ చెయ్యడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ వైసీపీ సిట్టింగ్‌ ఎంపీ వైవీ. సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యరని తెలుస్తోంది. ఆయన పార్టీ కార్యకలాపాల కోసం వాడుకోవాలని జగన్‌ డిసైడ్‌ అయ్యి ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -