Sunday, May 19, 2024
- Advertisement -

సొంత కారు లేని గులాబీ బాస్‌…అస్తులు, అప్పులు ఎంతంటె..?

- Advertisement -

కారు పార్టీకి ఓన‌ర్ కేసీఆర్‌…ఆయ‌న‌కు సొంత కారే లేదంట‌. విన‌డానికి వింత‌గా ఉన్నా అక్ష‌రాలా నిజం. ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్తులంతా త‌మ ఆస్తుల వివ‌రాల‌ను అఫిడ‌విట్‌లో పొందు ప‌ర‌చాల్సిందే. త‌నకు సొంత వాహనాలంటూ ఏమీ లేవని సీఎం కేసీఆర్ అఫిడవిట్ కూడా ఇచ్చారు. బుధవారం గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు దాఖలు చేసిన నామినేషన్ తో పాటు సమర్పించిన ప్రమాణపత్రంలో ఈ విషయం పేర్కొన్నారు.

దానితో పాటు అఫిడవిట్ లో ఆయన తన ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపరిచారు. అందులో తాను తన కొడుకు, కోడలికి అప్పు ఉన్నట్లు పేర్కొనడం గమనార్హం. అఫిడవిట్ ప్రకారం కేసీఆర్ మొత్తం ఆస్తుల విలువ రూ.22.60 కోట్లుగా పేర్కొన్నారు. వీటిలో చరాస్తులు రూ.10.40కోట్లు, స్థిరాస్తులు రూ.12.20 కోట్లుగా పేర్కొన్నారు. ఇకపోతే కేసీఆర్ వద్ద నగదు రూపంలో రూ.2 లక్షల 40వేలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఆయన భార్య శోభ పేరిట రూ.93 వేల నగదు, 2.2 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటి విలువ రూ.94.59 లక్షలుగా పేర్కొన్నారు. గతంతో పోలిస్తే కేసీఆర్‌కు అప్పులు మరో రూ.కోటి పెరిగి, రూ.8.88కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు. తన కొడుకు కేటీఆర్‌ వద్ద నుంచి రూ.82లక్షలు, కోడలు శైలిమ నుంచి రూ.24.65 లక్షలు అప్పు తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. 2014 ఎన్నికల సందర్భంగా 7 కోట్ల 87 లక్షల అప్పు చూపించిన కేసీఆర్ ఈసారి కోటి రూపాయలు అప్పు పెరిగినట్లు చూపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -