Saturday, May 18, 2024
- Advertisement -

జ‌మ్మ‌ల మ‌డుగు నియేజ‌క వ‌ర్గంలో మ‌రో సారి వేడెక్కిన రాజ‌కీయం

- Advertisement -

క‌డ‌ప జిల్లా తెలుగు దేశం పార్టీలో మ‌రోసారి రాజ‌కీయ విబేధాలు బ‌గ్గుమ‌న్నాయి. ఇద్ద‌రి నేత‌ల‌మ‌ధ్య ఆధిప‌త్య‌పోరు తారాస్థాయికి చేరుకోవ‌డంతో పార్టీ వ‌ర్గాల్లో టెన్స‌న్ మొద‌ల‌య్యింది. వారిలో వైసీపీనుంచి టీడీపీలోకి వెల్లి మంత్రి ప‌ద‌వి పొందిన ఆదినారాయ‌ణ‌రెడ్డి కాగా….మ‌రో నేత రామ‌సుబ్బారెడ్డి. ఇద్ద‌రి మ‌ధ్య‌న మొద‌టినుంచి విబేధాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్య‌నె రామ‌సుబ్బారెడ్డికి మెమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు స‌ద్దుమ‌నిగేలా చేశారు.

అది కూడా మూన్నాల్ల ముచ్చ‌ట‌గానె మిగిలింది. తాజాగా తెర‌పైకి మ‌రో అంశం రావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య నిగురుగ‌ప్పిన నిప్పులా ఉన్న ఆధిప‌త్య‌పోరు మ‌రోసారి మొద‌ల‌య్యింది. ఛైర్మెన్ ప‌ద‌వికి సంబంధించి ఇద్ద‌రూ పోటీకి దిగ‌డం పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. ఆసుప‌త్రి అభివృద్ది క‌మిటి ఛైర్మెన్ ప‌ద‌వి ఇద్ద‌రికి స‌వాల్‌గా మారింది.

మంత్రి కొడుకు సుధీర్‌రెడ్డికి ఛైర్మెన్ ప‌ద‌వి ద‌క్కించుకోవ‌డం కోసం పావ‌లు క‌దుపుతున్నారు.త‌న కొడుక్కి ప‌ద‌వి రాని ప‌క్షంలో రాజ‌కీయాల‌ను వ‌దిలి వేయ‌డానికికూడా వెన‌కాడ‌న‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇదే సంద‌ర్భంలో ప‌ద‌వి త‌న వారికి ద‌క్కించుకొనేందుకు రామ‌సుబ్బారెడ్డి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఛైర్మెన్ ప‌ద‌వి విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య పోరు తారాస్థాయికి చేరింది. ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు రావ‌డంతో ప్ర‌భుత్వం క‌మిటీ నియామ‌కాన్నె ప‌క్క‌న పెట్టేసింది. అయితే ఈ వివాధం ఎలాంటి ప‌రిస్థితుల‌కు దారితీస్తుందోన‌ని నాయ‌కులు భ‌య‌ప‌డుతున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు ముదిరితే ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు మాత్ర‌మే పార్టీలో ఉంటార‌న్న వ్యాఖ్య‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మ‌రి బాబు ఇద్ద‌రి మ‌ధ్య‌నున్న త‌గువు ఎలా తీరుస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -