Monday, May 20, 2024
- Advertisement -

అవిశ్వాస తీర్మానం మ‌ద్దతుపై టీఆర్ఎస్ రివ‌ర్స్‌

- Advertisement -

ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యం, ప్ర‌త్యేక‌హోదా పోరాటానికి మ‌ద్ద‌తిస్తామ‌ని ప్ర‌క‌టించిన టీఆర్ఎస్…ఎన్డీఏ స‌ర్కార్‌పై అవిశ్వాస తీర్మానం విష‌యంలో ఇప్పుడు అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని రాష్ట్రాల‌కు వ‌దిలేయాని కొద్ది రోజులుగా పార్ల‌మెంట్‌లో ఆ పార్టీ ఎంపీలు ఆందోళ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం నోటీసులను స్పీకర్‌ చదివిన సందర్భాల్లోనూ వెనక్కి తగ్గకపోవడం, దాంతో అవిశ్వాసంపై చర్చ జరగకుండా సభ వాయిదాపడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయంలో టీఆర్‌ఎస్‌ తటస్థంగా వ్యవహరించాని నిర్ణయించుకున్నట్లు ఎంపీలు తెలిపారు. రిజర్వేషన్లను రాష్ట్రానికే వదిలిపెట్టాలన్న డిమాండ్‌తో లోక్‌సభలో చేస్తున్న ఆందోళనలు మంగళవారం కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోమవారం కూడా టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో ధర్నా చేశారు.

రెండు వారాలుగా మా డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నాం. డిమాండ్లను హౌస్‌లో పెట్టి పరిష్కరించుకుంటాం. ఎవ్వరినీ అనుసరించాల్సిన అవసరం మాకు లేద‌ని ఎంపీ జితేంద‌ర్‌రెడ్డి తెలిపారు. సరైన హామీ లభించే వరకు ఆందోళన కొనసాగుతుంది’అని సమాధానమిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -