Sunday, May 19, 2024
- Advertisement -

బీఆర్ఎస్‌కు షాకిచ్చిన తుమ్మల..ఇవాళే కాంగ్రెస్‌లోకి!

- Advertisement -

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్‌కు షాకిచ్చారు. పాలేరు టికెట్ కేటాయించకపోవడం, పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు తుమ్మల. తన అనచరులతో భేటీ అయి రాజకీయ భవిష్యత్‌ ప్రణాళికపై చర్చలు కూడా జరిపారు. ఇక తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం కూడా ఉంది. అయితే తుమ్మలను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ నేతలెవరూ ముందుకురాలేదు.

ఇక తన అనచరులతో సమావేశం అయిన 10 రోజులు వేచి ఉన్న తుమ్మల ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనైదన ముద్రవేశారు తుమ్మల. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో బలమైన కేడర్ ఉంది. అందుకే 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇక తర్వాత పాలేరు ఉప ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2018 ఎన్నికల్లో పాలేరు నుండి పోటీచేసి ఓటమి పాలయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుండి గెలిచిన ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరగా తాజాగా ఆయనకే సీటు ఇచ్చారు సీఎం కేసీఆర్.

దీంతో తనకు సీటు కేటాయించకపోవడంతో అసంతృప్తికి గురైన తుమ్మల..బీఆర్ఎస్‌ను వీడేందుకే సిద్ధమయ్యారు. ఇవాళ బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరనున్న తుమ్మల…వచ్చే ఎన్నికల్లో పాలేరు లేదా ఖమ్మం నుండి బరిలోకి దిగే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -