Tuesday, May 21, 2024
- Advertisement -

ఆంధ్రాలో అధికారం వైసీపీదే… జగనే సీఎం…

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. రేపు (9న) సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే అన్నిపార్టీలు చావో రేవో అన్నట్లుగా ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించాయి. గెలుపుపై బాబు, జగన్, పవన్ లు ధీమాగా ఉన్నా ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యనే టఫ్ ఫైట్ ఉండనుంది. మరో సారి అధికారంలోకి రావాలని టీడీపీ విశ్వప్రయత్నాలు చేైస్తుంటే….. ఈ సారైనా అధికారంలోకి రావాలని వైసీపీ సర్వశక్తుల ఒడ్డుతోంది.

వైసీపీ తరుపున జగన్, విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారం చేయగా టీడీపీ నుంచి ప్రధానంగా చంద్రబాబె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రాచారం అటుంచితే ఇప్పటికే అధికారం వైసీపీదేనని తేలింది. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సర్వేల్లో ఫ్యాన్ ప్రభంజనం కొనసాగింది. అత్యధిక సీట్లు వైసీపీ సాధించి జగన్ అధినాయకవత్వంలో పార్టీ బంఫర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేల్లో తేలింది.

తాజాగా వీడీపీ అషోషియేషన్ తన సర్వేను విడుదల చేసింది. ఈ సర్వేలో వైసీపీ బంఫర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వే తేల్చింది. వైసీపీ 106 నుంచి 118 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. అధికార పార్టీ టీడీపీ 68 నుంచి 54 సీట్లకు పడిపోయింది. ఇక ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన పవన్ నేతత్వంతలోని పార్టీ జనసేన 1 నుంచి 3 సీట్లు కౌవసం చేసుకుంటుంద సర్వేలో తేలింది.

ఇక ఓట్ల శాతం పరంగా చూసుకుంటె వైసీపీ 43.85 శాతం ఓటు శాతం, టీడీపీ 40.00 ఓట్ల శాతం సాధిస్తుందని తేలింది. ఇరు పార్టీలకు మధ్య 3.85 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది. జనసేన 8.80 శాతం, బీజేపీ 2.40 శాతం ఓట్ల శాతం సాధించనున్నాయి. బాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికే వైసీపీ విజయం ఖరారయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -