Sunday, May 19, 2024
- Advertisement -

బాబుకు షాక్…… విశాఖ సభ ఫెయిల్….. వైకాపాలోకి భారీ చేరికలు

- Advertisement -

ధర్మ దీక్ష అని చెప్పి 40లక్షల ప్రజా సొమ్ముతో ఆర్భాటంగా సభ నిర్వహించడంతో పాటు ఆర్టీసీతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలను అడ్డంగా వాడేసుకున్న చంద్రబాబు సాధించింది ఏమీ లేదని రెండు రోజుల్లోనే తేలిపోయింది. వైఎస్ జగన్ ప్రత్యేక హోదా సభ పెడతానంటే విశ్వవిద్యాలయంలో రాజకీయ సభలేంటి అని అనుమతి నిరాకరించిన చంద్రబాబు… తాను మాత్రం ఎంచక్కా ఆంద్రా యూనివర్సిటీ నడిబొడ్డున సభ ఏర్పాటు చేసుకుని ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలతో రెచ్చిపోయి అన్ని విలువలూ తుంగలో తొక్కారు. విశాఖలో వైకాపాకు డిపాజిట్స్ కూడా రావని ఆడంబరంగా ప్రకటనలు చేశారు.

అయితే చంద్రబాబు మాటలను ఎవ్వరూ నమ్మలేదన్న విషయం రెండు రోజుల్లోనే తెలిసిపోయింది. సాధారణంగా వ్యాపారస్తులు ఎవరైనా అధికారంలోకి వచ్చే పార్టీలో చేరాలనుకుంటారు. 2019 ఎన్నికల్లో టిడిపి క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పి ప్రజలను నమ్మించాలని చంద్రబాబు ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ఎవ్వరూ నమ్మడం లేదు. విశాఖకు చెందిన బడా బిజినెస్ మేన్… ఎంవీబీ బిల్డర్స్ అధినేత ఎం సత్యనారాయణ తాజాగా జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. విశాఖలో ప్రజా స్పందనను స్వయంగా తెలుసుకున్నవాడిగా చెప్తున్నానని….. 2019 ఎన్నికల్లో విశాఖలో వైకాపా అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని సత్యనారాయణ చెప్పారు. 2014లో టిడిపి, బిజెపిలను గెలిపిస్తే అభివృద్ధి అన్న మాటే లేకుండా చేశారని…… పైగా విశాఖలో భూ కబ్జాలు, అక్రమాలతో టిడిపి నేతలు రెచ్చిపోయారని…..అందుకే ఈ సారి విశాఖ ప్రజలు వైకాపాను గెలిపించాలన్న ఆలోచనలో ఉన్నారని ఈ బిజినెస్ మేన్ కం నాయకుడు చెప్పుకొచ్చాడు. అన్నింటికీ మించి విజయసాయిరెడ్డి ప్రయత్నాలు విశాఖ ప్రజలు మెప్పించాయని సత్యనారాయణ చెప్పారు. 2014నాటికీ ఇప్పటికీ వైకాపా విషయంలో విశాఖ ప్రజల అభిప్రాయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -