Thursday, May 16, 2024
- Advertisement -

దెందులూరులో అబ‌య్య చౌద‌రికి హారతులు… చింత‌మనేనికి ఎదురుగాలులు..!

- Advertisement -

ప‌శ్చిమ గోదావ‌రిజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరులో ఇప్పుడు అధికార ప‌క్షానికి ఎదురు గాలి వీస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక్క‌డి ఎమ్మెల్యే అనుస‌రిస్తున్న‌నియంతృత్వ వైఖ‌రి.. చేస్తున్న దందాలు మితిమీరుతు న్నాయ‌ని, సెటిల్‌మెంట్ల‌తోనే బిజీబిజీగా గ‌డుపుతున్నాడ‌ని అంటున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ జోక్యం చేసుకుంటూ.. బేరాలు చేస్తున్నాడ‌ని అంటున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామం పార్టీని బ‌జారున ప‌డేస్తోంద‌ని చెబుతున్నారు. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాలు అని కూడా చూడ‌కుండా దోచుకోవ‌డ‌మే ప‌నిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌నే విమ‌ర్శ‌లు సామాన్యుల నుంచే వినిపిస్తున్నాయి.

చింత‌మ‌నేనికి అధికార గ‌ర్వం మెండు అన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. లేడీ ఎమ్మార్వో వ‌న‌జాక్షిని కొట్టినా… బ‌స్సుల‌ను ఆపినందుకు ఎవ‌రైనా ప్ర‌శ్నించినా వారిని అయినా కొట్టేస్తాడు. చంద్ర‌బాబు చింత‌మ‌నేని విష‌యంలో పైకి మాత్ర‌మే డ్రామాలు ఆడ‌తాడే త‌ప్పా.. లోప‌ల మాత్రం ఆయ‌న అంటే చాలా ఇష్ట‌ప‌డ‌తాడు. ఇలాంటి ఎమ్మెల్యేలే మ‌న‌కు కావాల‌ని ప్ర‌శంసిస్తుంటారు. అందుకే ఆయ‌న ఆగ‌డాల‌కు అంతే లేదు. ఈ క్ర‌మంలోనే యేడాది క్రితం వ‌ర‌కు ఇక్క‌డ బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌డంతో చింత‌మ‌నేని అరాచ‌కాలు భ‌రించిన జ‌నాలు స‌రైన ప్ర‌త్యామ్నాయ లీడ‌ర్ కోసం వెయిట్ చేశారు.

తాజాగా ఇప్పుడు వైసీపీ దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య క‌ర్త‌, విద్యావేత్త కొఠారు అబ్బ‌య్య చౌద‌రికి ఇక్క‌డి ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా నేరుగా ఆయ‌న‌కే ఫోన్ చేస్తున్నారు. త‌మ‌లో ఒక‌డిగా క‌లిసిపోయాడ‌ని, త‌మ క‌ష్టాలు విని ప‌రిష్క‌రించేందుకు ముందుకు వ‌స్తున్నాడ‌ని ఆయ‌న‌పై స్థానిక‌లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. నిజానికి దెందులూరు వంటి వివాదాస్ప‌ద నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు ఇంత బాహాటంగా వైసీపీకి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం ఇదే తొలిసారి. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆగ‌డాల‌కు భ‌య‌ప‌డి.. ఎవ‌రూ నోరు మెద‌ప‌ని ప‌రిస్థితి ఇక్క‌డ నెల‌కొంది.

నేరుగా అధికారుల‌పైనే దౌర్జ‌న్యం చేసి, కొట్టించ‌డం, వారిపైనే కేసులు పెట్టించ‌డం అనేది.. ఇక్క‌డి ఎమ్మెల్యేకి రివాజు గా మారిపోయిన నేప‌థ్యంలో సామాన్యులు నోరు ఎత్తేందుకు, త‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌ను ప్ర‌శ్నించేందుకు కూడా వెనుకాడుతున్న ప‌రిస్థితి ఉంది. ఈ స‌మ‌యంలో నేనున్నానంటూ.. అబ‌య్య చౌద‌రి రావ‌డం, వారికి అన్ని విధాలా అండ‌గా నిల‌బ‌డ‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ ఇప్పుడు అబ్య‌య్య‌కు జై! కొడుతున్నారు. భ‌విష్య‌త్తులో ఈయ‌న‌నే త‌మ‌కు నాయ‌కుడిగా ఎన్నుకునేందుకు సైతం ఇక్క‌డి వారు సిద్ధ‌మ‌య్యారంటే.. అధికార పార్టీపై ఏ రేంజ్‌లో క‌సి పెరిగిపోయిందో ఇట్టే అర్ధం చేసుకోవ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -