Saturday, May 11, 2024
- Advertisement -

ముంబైపై ఢిల్లీ..లక్నోపై రాజస్థాన్‌ గెలుపు

- Advertisement -

ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది రాజస్థాన్ రాయల్స్. లక్నో సూపర్ జెయింట్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు కెప్టెన్ శాంసన్, ధృవ్ జురేల్ రాణించడంతో గెలుపు సాధ్యమైంది. శాంసన్ 33 బంతుల్లో 71 నాటౌట్,జురెల్ 34 బంతుల్లో 52 నాటౌట్ చేయగా యశస్వి జైస్వాల్ (24), జోస్ బట్లర్ (34), రియాన్ పరాగ్ (14) పరుగులు చేశారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణత ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 196 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (76), దీపక్ హుడా (50) పరుగులు చేశారు. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 8 గెలిచి 1 మాత్రమే ఓడి 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

మరో మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించింది ఢిల్లీ. 258 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు పోరాడి ఓడారు. దీంతో ఢిల్లీ 10 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. ఇషాన్ కిషన్ 20, రోహిత్ శర్మ 8, సూర్యకుమార్య యాదవ్ 26, తిలక్ వర్మ 63, హార్దిక్ పాండ్యా 46 పరుగులు చేశారు. దీంతో ముంబై స్కోరు 20 ఓవర్లకు 247-9గా నమోదైంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి అదిరే ఆరంభాన్ని ఇచ్చారు ఓపెనర్లు. ముఖ్యంగా ఫ్రేజర్ 27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. 6.4 ఓవర్లలోనే డీసీ స్కోరు 100 పరుగులు దాటేసింది. హోప్ 17 బంతుల్లో 5 సిక్సర్లతో 41 పరుగులు, పంత్ 29,స్టబ్స్ 25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -