Sunday, May 5, 2024
- Advertisement -

ఖ‌మ్మం బ‌హిరంగ స‌భ‌లో మాట జారిన చంద్ర‌బాబు… సోషియ‌ల్‌మీడియాలో వైర‌ల్‌

- Advertisement -

తెలంగాణ ఎన్నికల పోరులో అధికార ప్రతిపక్ష పార్టీల మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మాట‌లు మాట్లేడేట‌ప్పుడు రాజ‌కీయ నాయ‌కులు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. ఒక మాట నోటీనుంచి వ‌చ్చింటే దాన్ని వెన‌క్కు తీసుకోల‌రు. ఎన్నిక‌ల స‌మ‌యంలో అయితే ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడాలి లేకుంటే న‌వ్వుల పాలు అవ‌డం ఖాయం.

అలాంటి సంఘ‌ట‌నే ఖ‌మ్మంలో ఏర్పాటు చేసిన మ‌హాకూట‌మి బ‌హిరంగ స‌భ‌లో చోటు చేసుకుంది. టీడీపీనుంచి ప‌వ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చారు. అప్పుడ‌ప్పుడు బాబు, లేకేష్‌ల‌మీద విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే బాబు మాత్రం జ‌న‌సేన విష‌యంలో తొంద‌ర‌ప‌డి మాట్లాడారో లేక నిజంగానే మాట్లాడారో తెలియ‌దుగాని….ఇప్పుడు అది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అస‌లు విష‌యానికి వ‌స్తే ..పవన్‌ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇప్పటికీ చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తోందని, టీడీపీకి మంచి చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని ఆరోపణలు వస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తలకు టీడీపీతో కలిసి సైనికుల్లా పనిచేసి టీఆర్ఎస్‌ను ఓడించాల‌ని పి లుపునిచ్చారు.

తొలుత జనసేన కార్యకర్తలు అన్న చంద్రబాబు రెండోసారి కూడా తెలంగాణ జనసేన కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ వ్యాఖ్య‌లు సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. చంద్రబాబు తన మాజీ మిత్రుడైన పనవ్ కల్యాణ్ పార్టీని ఇంకా మర్చిపోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. మహాకూటమిలో తెలంగాణ జనసమితి అనే పార్టీ ఒకటున్న విషయాన్ని చంద్రబాబు గుర్తులేక‌పోవ‌డం విచిత్ర‌మే.

బాబు మ‌తి భ్ర‌మించి మాట్లాడుతున్నాడో లేక నిజంగా మాట్లాడుతున్నాడో తెలియ‌దుగాని….అస‌లు జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబా లేక ప‌వ‌నా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. ఎందుకంటే ఎక్క‌డైనా ప‌లావా వాళ్ల‌ను గెలిపించండంటూ కార్య‌క్త‌ల‌కు పిలుపు నిచ్చేది ఆ పార్టీ అధ్య‌క్షులు. కాని తెలంగాణాలో మాత్రం విచిత్రంగా జ‌న‌సైనికులు, టీడీపీ సైనికులు మ‌హాకూట‌మిని గెలిపించండంటూ పిలుపు నివ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఒక వైపేమో ఇరు పార్టీల నాయ‌కులు విమ‌ర్శ‌లు చేసుకుంటారు. కాని బాబు మాత్రం ఇలా మాట్లాడ‌టం ఇరు కార్య‌క‌ర్త‌ల్లోనూ గంద‌ర‌గోళం నెల‌కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -