Tuesday, May 14, 2024
- Advertisement -

చంద్ర‌బాబు ఆశ‌లు అడియాస ల‌య్యాయి…..కార్య‌క‌ర్త‌ల దెబ్బ‌కు ఇంట్లోనె కూర్చున్న‌నేత‌

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం చివ‌రిరోజు మాత్ర‌మే మిగిలి ఉండ‌టంతో పార్టీలు త‌మ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. ప్ర‌ధానంగా గెలుపోట‌ముల‌తోపాటు…నాయ‌కుల ఫిరాయింపులు ప్ర‌ధానం కానున్నాయి. ఉప ఎన్నిక‌లో వైసీపీ గెలుపు ఖాయ‌మ‌ని స‌ర్వేలు అనుకూలంగా వ‌చ్చాయి. అయితే తాజాగా చంద్ర‌బాబుకు మ‌రో షాక్ త‌గిలింది. ఆయ‌న రాక‌వ‌ల్ల పార్టీకి మేలు జ‌రుగుతుంద‌ని భావించిle బాబుకు నిరాశ ఎదుర‌య్యింది.

ఉప ఎన్నిక పీక్ స్టేజీలో ఉన్న స‌మ‌యంలో గంగుల ప్ర‌తాప్ రెడ్డి టీడీపీ లోకి ఫ్లేట్ ఫిరాయించిన సంగ‌తి తెలిసిందే. దీంతో అనుకోకుండా ఆయ‌న ఒక్కసారిగా తెర‌పైకి వ‌చ్చారు. ఏమైందో ఏమో…అధికార‌ప‌క్షం ఏం కాంట్రాక్టు ఇచ్చిందో తెలియ‌దు కానీ గంగుల ప్ర‌తాప్‌రెడ్డి టీడీపీలో చేరారు. అయితే ఆయ‌న చేరి రెండు రోజుల‌యినా … ఆయ‌న మాత్రం టీడీపీ త‌ర‌పున ప్ర‌చారం చేయ‌డం లేదు . దీని వెనుకు పెద్ద కార‌నాలున్నాయంటున్నారు నాయ‌కులు.

పార్టీలో చేరిన గంగుల ప్ర‌తాప్ రెడ్డికి అనుచ‌రులు,కార్య‌క‌ర్త‌లు నుంచి వ‌చ్చిన రియాక్ష‌న్‌తో ఆయ‌న‌కు దిమ్మతిరిగిపోయింది. దీంతో ఆయ‌న త‌న ఇంటికే పరిమిత‌మ‌య్యారు. ఇటు చంద్ర‌బాబు రెండు రోజుల ప్ర‌చారంలో ఆయ‌న జాడ క‌నిపించ‌లేదు. ఆయ‌న పార్టీ మార‌డం ఆయ‌న అనుచ‌రులకే కాదు, కుటుంబానికి కూడా ఇష్టం లేదు. ఇటు అనుచ‌రుల‌ను పిలిచి పార్టీ మారాల‌ని కోరితే ఎవ‌రూ ముందుకురావ‌డం లేదు.

ఆయ‌న‌తో ఉన్న సంబంధం , పెద్ద‌రికం కారనంగానె అయ‌న ఇంటికి వ‌చ్చామ‌ని …పార్టీ మారేందుకు కాద‌న్నారు. ఏదో ఒక గౌర‌వంతో ఆయన ఇంటికి వ‌స్తే పార్టీ మారామని ప్ర‌చారం చేస్తే బాగుండ‌దని మీడియాను హెచ్చ‌రించారు. మొత్తానికి చంద్ర‌బాబు ఆడుతున్న నాట‌కం అంత‌గా ర‌క్తి క‌ట్ట‌లేదు. అందుకే ప్ర‌తాప్‌రెడ్డికి సీన్ రివ‌ర్స్ కొడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -