Sunday, May 5, 2024
- Advertisement -

వైకాపాలో కన్నా చేరిక…….. వ్యూహం ఎక్కడ బెడిసికొట్టిందంటే?

- Advertisement -

విషయం తేలక ముందే టిడిపి మీడియా రెచ్చిపోతుంది. ఏం జరిగినా జగన్‌పై విమర్శలు చేయడం ఎలా అని ఆలోచించే తనదైన స్టైల్‌లోనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇప్పుడు కన్నా చేరిక గురించి కూడా తన మీడియాలో ఇష్టారీతిన వార్తలు రాయిస్తున్నాడు. బిజెపి నేత కన్నాను వైకాపాలో చేర్చుకుంటే తీవ్రపరిణామాలు తప్పవని అమిత్ షా నుంచి జగన్‌కి ఫోన్ కాల్ వచ్చిందని……అందుకే వైకాపాలో కన్నా చేరిక ఆగిపోయిందని రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. మరి అదే బిజెపి లీడర్…….కన్నా కంటే కాస్త ప్రజాదరణ ఎక్కువ ఉన్న లీడర్ కాటసాని రాంభూపాల్ రెడ్డి వైకాపాలో చేరుతున్నాడుగా………మరి అదే అమిత్ షా వారు కాటసానిని వైకాపాలో చేర్చుకోవద్దని జగన్‌కి కాల్ చేయలేదా? అయినా జగన్-అమిత్ షాలు ఫోన్ కాల్‌లో మాట్లాడుకుంటే రాధాకృష్ణకు ఎలా తెలిసింది? లాంటి లాజిక్కులు మాత్రం అడగకూడదు. ప్రపంచానికి పాఠాలు చెప్పా అన్నా, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికాక కూడా నిప్పులా బ్రతికా అని నాయకుడు చెప్పగాలేనిది బంటు లాంటి తోకపత్రిక యజమాని ఈ మాత్రం అబద్ధాలు చెప్తే అదో ఘోరమా?

బూతు రాతల విషయం పక్కన పెడితే కన్నా చేరిక విషయంలో వైకాపా వ్యూహం ఎక్కడ ఫెయిలయింది అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానాలు తెలుస్తున్నాయి. వైకాపా వ్యూహం ఫెయిల్ అవ్వడం కాదు కానీ కన్నా చేరికను ఎలా అయినా ఆపాలనుకున్న చంద్రబాబు కన్నాకు బంపర్ ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది. కన్నాకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ ఇచ్చి పార్టీలో చేర్చుకోవాలనుకున్నాడు జగన్. అయితే చంద్రబాబు మాత్రం కన్నా కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్‌తో పాటు ఎంపి టిక్కెట్ కూడా ఇస్తానని ఆఫర్ చేశాడు. ఇక్కడే కన్నా ఆలోచనలో పడిపోయాడని తెలుస్తోంది. అయితే కన్నా అనుచరులు మాత్రం చంద్రబాబును అస్సలు నమ్మలేమని, అంతే కాకుండా 2019 ఎన్నికల్లో గెలిచేది వైకాపానేనని కన్నాపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడు ఈ విషయాలపై తేల్చేకోలేక కన్నా సతమతం అవుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న నాయకులకే టికెట్లు సర్దుబాటు చేయలేక……వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే తలపట్టుకుంటున్న చంద్రబాబు…….కన్నా లాంటి కొత్త నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి ఎంపి, ఎమ్మెల్యే టిక్కెట్స్ ఆఫర్ ఇవ్వడం మాత్రం విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. వైకాపాను బలహీన పరుస్తున్నాను అని చంద్రబాబు అనుకుంటున్నాడు కానీ 2019లో టిడిపి అసమ్మతి నాయకులే టిడిపిని ఓడించేలా చంద్రబాబు రాజకీయ అమాయకత్వం ……..తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ చందంగా ఉందన్న విషయాన్ని మాత్రం చంద్రన్న గుర్తించలేకపోతూ ఉండడం మాత్రం నాయకత్వ అసమర్థతనే సూచిస్తోందని టిడిపి నాయకులే చర్చించుకుంటున్నారు. ఆల్రెడీ అఖిల-సుబ్బారెడ్డిలాంటి అసమ్మతి పోరు అన్ని నియోజకవర్గాల్లోనూ ఉన్న నేపథ్యంలో ఈ కొత్త గొడవలతో కుంపటి రాజేసుకోవడం అవసరమా అన్నది టిడిపి నాయకుల భావన. కానీ చంద్రబాబు అచ్చంగా సీతయ్య టైప్ కదా…….ఎవ్వరి మాటా వినడంతే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -