Monday, May 20, 2024
- Advertisement -

కేసీఆర్ తో తాడో పేడో తేల్చుకుంటానన్న జగన్.?

- Advertisement -

నీటి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొంత గ్యాప్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే.. ఈ విషయాల్లో ఇరు రాష్ట్రాల సీఎం లకు అసలు పొసగడం లేదు.. దీంతో ఈ విషయంలో కేంద్రం జోక్యం కలిపించుకుని చర్చకు పిలవగా పలుమార్లు ఈ భేటీ వాయిదా పడడంతో ఈ వివాదం మళ్ళీ మొదటికొచ్చింది.. దీంతో ఈ విషయం నానుతూ పోతుండడంతో జగన్ ఒక్కసారి కృష్ణ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.. వాస్తవానికి కృష్ణ బోర్డు వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనంలో ఉన్నారు..

తెలంగాణ సర్కార్ వ్యవహారంలో సుతిమెత్తగా వ్యవహరిస్తూ ఏపీ విషయంలో అత్యంత కఠినంగా ఉంటుందని అయన భావితున్నారు. అందుకే కృష్ణ బోర్డు తో తాడో పేడో తేల్చుకునే విధంగా జగన్ ఓ నిర్ణయానికొచ్చేశారట.. ఇప్పైట్కే దీనిపై జరిగిన ఓ మీటింగ్ లో అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చేశారట.. ఈ విషయంలో అసలు మొహమాటపడొద్దని ఏపీపై కృష్ణా రివర్ బోర్డు వివక్ష చూపుతోందని.. తమను పట్టించుకోకుండా.. తెలంగాణాపై సానుభూతి చూపుతుందని వారితో వెల్లడించి అప్రమత్తం చేశారట..

తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని కిందకి విడుదల చేస్తున్నా.. కేఆర్‌ఎంబీ నిలుపుదల చేయ లేదని ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కోరినా బోర్డు … తెలంగాణను ఆదేశించలేకపోయిందని… ఏదో మొక్కుబడిగా లేఖలు రాసి.. సరి పెట్టిందని… ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అదే ఏపీ విషయానికి వచ్చేసరికి… పోతిరెడ్డిపాడు ద్వారా అదనంగా 0.517 టీఎంసీలు వాడుకోగానే.. కృష్ణాబోర్డు నుంచి తాఖీదు వచ్చింది. దాంతో వాళ్ళైతే ఒకలా ,మేమైతే ఒకలానా అని అసహనం ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోంది.. సీమ ప్రాజెక్టులపై తెలంగాణకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న అధికారులు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటున్నారు. న్యాయ స్థానాలు, అపెక్స్ కౌన్సిల్‌లో..డాక్యుమెంట్లు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే.. ఇక కేఆర్ఎంబీ ఆదేశాలను పెద్దగా పట్టించుకోకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -