Sunday, May 19, 2024
- Advertisement -

ప.గో.లో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ సీనియర్ నేతలు వైకాపాలోకి

- Advertisement -

జగన్ ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 13 నుంచీ పశ్ఛిమ గోదావరి జిల్లాలో అడుగిడనుంది. అయితే అదే పశ్ఛిమ గోదావరి జిల్లా నుంచి వైకాపాలోకి చేరికల విషయం మాత్రం అప్పుడే షురూ అయింది. కాంగ్రెస్, టిడిపి, బిజెపిల నుంచి వైకాపాలోకి చేరికలు ఉండబోతున్నాయి. టిడిపి సీనియర్ నేతల కుమారులు జగన్ వెంట నడవడానికి ఆసక్తి చూపిస్తుండడం టిడిపిలో ఆందోళన పెంచుతోంది. వారసులు తమ మాట వినడం లేదని టిడిపి సీనియర్ నేతలు బాబుకు విన్నవించుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్, బిజెపిలకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ సీనియర్ నేతల చేరికలను జగన్ కన్ఫాం చేశాడని తెలుస్తోంది.

కన్నా లక్ష్మీనారాయణ చేరిక విషయంలో హడావిడి చేసి దెబ్బతిన్న నేపథ్యంలో ఈ సారి మాత్రం చేరిక సమయం వరకూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా నేతల పేర్లు కూడా తెలియకుండా వైకాపా నాయకలు జాగ్రత్తపడుతున్నారు. టిడిపి నుంచి కూడా చాలా మంది రెండో తరగతి నాయకులు వైకాపాలో చేరాలన్న ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ జగన్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. నియోజకవర్గం స్థాయిలో కాస్త మంచి పేరు ఉండి……. ఓటర్లను ప్రభావితం చేసే స్థాయి నాయకుల చేరికలు మాత్రమే ఉండేలా నాయకులకు దిశానిర్దేశం చేశాడట జగన్. ఇక యువ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా చూడాలని జగన్ అభిప్రాయపడుతున్నారట. పార్టీలో చేరతామని చాలా మంది నాయకులే విజయసాయిరెడ్డి, బొత్సలాంటి నాయకులను కలుస్తూ ఉన్నప్పటికీ అలాంటి వారందరినీ చేర్చుకుని అసలుకే మోసం జరిగేలా చేసుకోవద్దని…….పార్టీకి చెడ్డపేరు వచ్చే పరిస్థితులు ఉంటే అస్సలు సహించేది లేదని జగన్ పార్టీ నేతలకు చెప్పాడట. అందుకే ప్రస్తుతానికి అయితే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ సీనియర్ నేతల చేరికలు మాత్రం ఖాయం అని తెలుస్తోంది. పశ్ఛిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర అయిపోయేలోపు ఈ నాయకులు వైకాపాలో చేరనున్నారు. ఇప్పటికే ఈ చేరికల వార్తలతో వైకాపా శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంటే……….మరోవైపు టిడిపి నాయకుల్లో మాత్రం టిడిపి నుంచి యువ నాయకులు వైకాపాలో చేరతారేమోనన్న ఆందోళన కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -