Wednesday, May 15, 2024
- Advertisement -

2019 ఎన్నిక‌ల వైసీపీ తొలి అభ్య‌ర్థి చెరుకులపాడు శ్రీదేవి

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప మ‌హాపాద‌యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం క‌ర్నూలు జిల్లాలో యాత్ర జ‌రుగుతోంది. అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు కూడా వ‌స్తున్న నేప‌థ్య‌లో జ‌గ‌న్ అభ్య‌ర్తుల విష‌యంలోకూడా త‌గు జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. అధికార‌పార్టీ టీడీపీకంటె ముందె అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టిస్తున్నారు.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం కృష్ణగిరి గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తాము ఏ విధంగా కష్టాలు పడుతున్నామో వివరించారు.

ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్ తొలిసారిగా పాదయాత్రలో పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. పత్తికొండ నియోజకవర్గానికి తమ పార్టీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవి పేరును అధికారికంగా ప్రకటించారు. గతంలో పత్తికొండ నియోజకవర్గానికి వైసీపీ ఇంఛార్జిగా ఉన్న చెరుకులపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అతని భార్యే ఈ శ్రీదేవి.

గ‌తంలో నారాయణ రెడ్డి అంత్యక్రియలకు వచ్చిన సమయంలోనే 2019 ఎన్నికల్లో తమ పార్టీ నుంచి సీటు ఇస్తానని జగన్ శ్రీదేవికి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ నెర‌వేర్చుకున్నారు. కృష్ణగిరి లో జ‌రిగిన స‌భ‌లో జ‌గ‌న్ పార్టీ అభ్యర్థిగా మరోసారి ప్రకటించారు. ఆమెను అభ్యర్థిగా నియమించడానికి పార్టీలో ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడం, భర్త చనిపోయిన సింపతీ ఉండటంతో ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది. శ్రీదేవిని వ‌చ్చె ఎన్నిక‌ల్లో గెలిపించి ఆద‌రించాల‌ని ప్రజలను జ‌గ‌న్ కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -