Saturday, April 27, 2024
- Advertisement -

ఏపీ మంత్రి బొత్సకు సమన్లు జారీ చేసిన హైదరాబాద్ సీబీఐ కోర్టు….

- Advertisement -

ఏపీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ లోని సీబీఐ సమన్లు జారీ చేసింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో సాక్షిగా ఉన్న ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ ఉన్న సంగతి తెలిసిందే.సెప్టెంబర్ 12న ఆయన హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. అందువల్ల ఆయన 12న కోర్టు ముందు హాజరై… ఈ కేసులో ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్న సమయంలో వోక్స్ వ్యాగన్ కేసు చోటు చేసుకొంది. 2005 కేసు నమోదయ్యింది. అప్పట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్సపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఫోక్స్ వ్యాగన్ కంపెనీని హైదరాబాద్ నుంచీ వైజాగ్‌కి తరలించాలనే అంశంపై బొత్స, మరికొందరికి పెద్ద ఎత్తున ముడుపులు అందాయన్న ఆరోపణలు వచ్చాయి .దీనిపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకి ఆదేశించింది

వోక్స్ వ్యాగన్ కేసులో సుమారు రూ. 12 కోట్ల రూపాయాల అవినీతి చోటు చేసుకొందని సీబీఐ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే సుమారు రూ. 7 కోట్లను రికవరీ చేశారు. మరో రూ. ఐదు కోట్లను రికవరీ చేయాల్సి ఉంది. విచారణ జరుగుతున్న సమయంలో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. 59మంది సాక్షులుగా ఉన్నారు. ఇప్పటికే 3వేల పేజీల ఛార్జిషీట్‌ను సీబీఐ దాఖలు చేసింది.ఈ కేసులో ఆనాడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ సాక్షిగా ఉన్నందున ఈ కేసు విషయమై హాజరుకావాలని సీబీఐ కోర్టు శుక్రవారం నాడు సమన్లు జారీ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -