Sunday, May 19, 2024
- Advertisement -

మ‌రింత జోరు పెంచాల‌ని వైసీపీ సోషియ‌ల్ మీడియాకు జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌…

- Advertisement -

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో సోషియ‌ల్ మీడియా ప్ర‌ముఖ పాత్ర పోషిస్తోంది. గ‌తంలో ఇది లేక‌పోవ‌డంతో అధికార పార్టీనేత‌లు ఏం చేసినా బ‌య‌ట‌కు వ‌చ్చేది కాదు. కాని ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్ర‌భుత్వాలు చేస్తున్న త‌ప్పులు సోషియ‌ల్ మీడియా ద్వారా క్ష‌ణాల్లో ప్ర‌జ‌ల‌కు చేరుతున్నాయి. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ వైసీపీ సోషియ‌ల్ మీడియా మ‌రింత జోరు పెంచ‌నుంది.

ప్ర‌స్తుతం వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు సోషియ‌ల్ మీడియా వేదిక‌గా దూసుకుపోతున్నాయి. వైసీపీ సోషియ‌ల్ మీడియా విభాగం దూసుకుపోతోంది. 2014 ఎన్నిక‌ల్లో పార్టీ సోషియ‌ల్ మీడియాలో చాలా వెనుక‌బ‌డ‌టంతో అధికారాన్ని తృటిలో చేజార్చుకున్నారు. కాని ఈసారి అలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా జ‌గ‌న్ ప్ర‌ణాలిక‌ల‌కు అణుగునంగానే వైసిపి ప్రణాళికలు వేస్తోంది. గడచిన మూడున్నరేళ్ళుగా సోషల్ మీడియాలో జగన్ కు అనుకూలంగా వైసీపీ సోష‌యిల్ మీడియా ప్రచారంలో దూసుకుపోతోంది.

ఇక్కడ వైసిపి సోషల్ మీడియా విభాగం రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఒకవైపు జగన్ అనుకూల ప్రచారం చేస్తూనే మరోవైపు చంద్రబాబునాయుడు, నారా లోకేష్, తెలుగుదేశంపార్టీలకు వ్యతిరేకంగా దుమ్ము దులిపేస్తోంది. పార్టీ సోష‌యిల్ మీడియాకు టీడీపీ సోషియ‌ల్ మీడియా పోటీ ఇవ్వ‌లేక చితికిల బ‌డింది. జ‌గ‌న్‌పై అధికార పార్టీ నేత‌లు ఎలాంటి వ్యాఖ్య‌లు చేసినా అందుకు రెట్టింపు సంఖ్య‌లో జగన్ కన్నా ఎక్కువగానే కౌంటర్లు ఇస్తోంది. అంతేకాకుండా ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల‌ను ఆధారాల‌తో సోషియ‌ల్ మీడియాలో ఎండ‌గ‌డుతోంది.

వైసిపి సోషల్ మీడియా ధాటిని చంద్రబాబు, లేకేష్ తట్టుకోలేకే వైసిపి సానుభూతిపరులపై అనేకుల మీద కేసులు పెట్టి కొంద‌రిని జైలుపాలు చేశారు. ఎలాగూ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సోషల్ మీడియా జోరును మరింత పెంచాలని జగన్ నిర్ణయించారు.

అందులో భాగంగానే మండలస్ధాయిలో కూడా సోషల్ మీడియా ప్రచారం కోసం ప్రత్యేకంగా కమిటీలను వేశారు. రాష్ట్రంలోని 6 వందలపై చిలుకు మండలాల్లో బాగా యాక్టివ్ గా పనిచేసే కురాళ్ళతో పార్టీ కమిటీలు వేసింది. ప్రతీ కమిటీలో కనీసం 15 మందకి తగ్గకుండా ఉంటారంట‌. మ‌రి వైసీపీ సోషియ‌ల్ ఆర్మీని చిన‌బాబు, పెద‌బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -