Sunday, May 19, 2024
- Advertisement -

జ‌న‌సేన తిక్క‌లెక్క‌ల‌కు జ‌గ‌న్ లెక్కె ఇదే..

- Advertisement -

పవన్ కల్యాణ్ జనసేన పార్టీపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ వచ్చినంత మాత్రాన తన పార్టీ కి వచ్చే నష్టమేం లేదంటూ వైఎస్ జగన్ పాదయాత్రలొ కుండబద్దలు కొట్టేశాడు.. దీంతొ ఇప్పటిదాకా జగన్ అటు జనసేన కానీ..ఇటు బిజెపి కానీ ఏదొక పార్టీతొ పొత్తు పెట్టుకుంటాడని కొంతమంది చేస్తొన్న ప్రచారానికి ఒపెన్‌గా చెక్ చెప్పినట్లైంది.

జనసేన ప్రభావం తమపై ఉండబోదన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకి పడకుండా జనసేన అడ్డుకుంటుందన్న వార్తల్లో వాస్తవం లేదని, అది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు.

నిజానికి ఇదే తరహా వ్యాఖ్యలు అప్పట్లొ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరంజీవిపై చేశారు..చివరికి అదే నిజమైంది.ఐతే ఈ లెక్క 2014లొ కాస్త తేడా అయింది. ఎందుకంటే పవన్ కల్యాణ్ డైరక్ట్ గా పొటీ చేయకుండా..టీడీపీ,భాజాపాకు మద్దతు ప్ర‌క‌టించ‌డంతో వైసీపీ అధికారానికి దూర‌మ‌య్యింది.

అయితే 2019 ఎన్నిక‌ల్లో పొటీ చేసినా..చేయకుండా వెనకుండి పక్కనుండి టిడిపికి మద్దతిచ్చినా తన గెలుపు ఆపలేరని జగన్ ధీమా వ్యక్తం చేయడం విశేషం. ఐతే అతి విశ్వాసం ఎప్పుడూ మంచిది కాదనే సంగతి 2014 ఎన్నిక‌ల్లో నిర్ధార‌న అయ్యింది. పాద‌యాత్రో వ‌స్తున్న విశేష ప్ర‌జాస్పంద‌న‌ను బట్టే జ‌గ‌న్ గెలుపుపై ధీమా వ్య‌క్తం చేస్తున్నార‌ని పార్టీనాయ‌కులు అంటున్నారు.

పొత్తుపై వ్యాఖ్య‌లు చేశారు. పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడడం తొందరపాటే అవుతుందని అన్నారు. వాటి గురించి ఎన్నికలప్పుడు మాట్లాడుకుంటేనే బాగుంటుందని జగన్ చెప్పారు. 2014 ఎన్నిక‌ల్లోలాగా అతివిశ్వాసంతో ముందుకెల్ల‌కుండా మ‌రో సారి అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా ముందుకెల్తే జ‌గ‌న్ ల‌క్ష్యం నెర‌వేర‌తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -