Tuesday, May 14, 2024
- Advertisement -

ఏం బాబయ్య…… చివరి బడ్జెట్‌లో కూడా చిప్పేనయ్యా….. ఎక్కడయ్యా నీ పౌరుషం, అనుభవం?

- Advertisement -

వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత సీమాంధ్ర నుంచి మిగిలిన అనుభవజ్ఙుడైన నాయకుడు చంద్రబాబు. వైఎస్సార్ బ్రతికున్నంత కాలం అన్ని విషయాల్లోనూ సీమాంధ్రులకు పూర్తి భరోసా ఇచ్చాడు. వైఎస్ ఉన్నంత కాలం తెలంగాణాలో కూడా సీమాంధ్రులు సగౌరవంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత నుంచీ మాత్రం చేతకాని నాయకులు, చేవలేని నాయకుల పుణ్యమాని సీమాంధ్రుల హృదయం నేటికీ కూడా రగులుతూనే ఉంది. కుట్రలు పన్ని జగన్‌ని జైలుకు పంపించారు. రాష్ట్ర విభజన నాడు రెండు కళ్ళ సిద్ధాంతం వినిపించి సీమాంధ్రకు పూర్తిగా ద్రోహం చేసిన నాయకుడు ఒకరు. విభజన పర్వం మొత్తం పూర్తయ్యే వరకూ ఫాం హౌసుల్లో, షూటింగుల్లో ఎంజాయ్ చేసి……..అంతా అయిపోయాక పెడబొబ్బల డ్రామాలు నడిపించిన నట నాయకుడు మరొకరు.

రాష్ట్ర విభజన జరిగిన మరుక్షణం నుంచీ అధికారంలోకి రావడానికి మాత్రం అన్ని కుట్రలూ, వ్యూహాలు పన్నారు. అంతా కూడా ఒక పచ్చ కూటమిగా ఏర్పడి సమర్థవంతంగా ప్రజలను నమ్మించారు. విభజన పర్వంలో సీమాంధ్రులకు కాంగ్రెస్‌తో సమానంగా ద్రోహం చేసిన బిజెపికి ఓట్లేయమని ఘనంగా ప్రచారం చేశారు. అన్నీ మేం చూసుకుంటాం అన్నారు.

ఎన్నికలవ్వగానే ప్రశ్నిస్తానన్న హీరోయిజం నాయకుడు జీరోయిజం చూపిస్తూ……‘నాకేం బలం ఉంది? నాకేం చేతనవుద్ది? నా దగ్గరేమైనా ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎంపిలు ఉన్నారా?’ అని చవట మాటలు మాట్లాడాడు. ఎన్నికల్లో పోటీ చేయకుండా తన అభిమాన ఓట్లను అమ్ముకుంటే సీట్లు ఎలా వస్తాయనుకున్నాడో తెలియదు మరి. ప్రశ్నిస్తానన్నప్పుడు ఆ విషయం తెలియదా?

ఇక ఎన్నికల్లో గెలవడం కోసం రాష్ట్ర విభజన పాపం మొత్తాన్ని కూడా అంతకు మూడు నాలుగేళ్ళ క్రితమే చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఖాతాలో వేయడానికి మాత్రం గట్టిగా ప్రయత్నం చేశారు. విష ప్రచారం చేశారు. జైల్లో ఉన్న జగన్‌కి కూడా ఆ పాపాన్ని అంటగట్టారు.

మొత్తానికి జనాలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. విభజన నాడు మోసపోయిన సీమాంధ్రుల ప్రయోజనాలన్నింటినీ కూడా ఓటుకు కోట్లు కేసుతో సహా స్వార్థప్రయోజనాల కోసం తాకట్టుపెట్టేశారు. ఇప్పుడిక ఈ టెర్మ్‌కి చివరి బడ్జెట్ కూడా వచ్చేసింది. గత నాలుగేళ్ళుగా చేస్తున్నట్టుగానే సీమాంధ్రకు చిప్ప చూపించారు ఢిల్లీ పాలకులు. మరి ప్రశ్నిస్తానన్న పవర్ స్టార్ హీరోయిజం ఎక్కడ? ప్రపంచానికి పాఠాలు చెప్పిన నాయకుడు, అత్యంత అనుభవజ్ఙుడు, ఎవ్వరికీ తలవంచను అని పదే పదే చెప్పుకునే నాయకుడు ఎక్కడ? కుక్కిన పేనుల్లా పడుండడానికి కారణం ఏంటి? ఇప్పటికే ఆర్థిక శాఖా మాత్యులు యనమలవారు బడ్జెట్ బ్రహ్మాండం అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. మిగతా పచ్చ బ్యాచ్‌ది కూడా అదే పాట అనడంలో సందేహం లేదు.

కానీ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని చెప్పి ఆందోళన చేస్తున్న వైకాపా నాయకులను, కార్యకర్తలను మాత్రం సమర్థవంతంగా అరెస్ట్ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. హోదా కోసం పోరాటం చేసినప్పుడూ ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసమే బ్రతుకుతున్నాం, రక్తం ధారపోస్తాం, స్నానపానాదులు కూడా లేకుండా, మనవడితో కూడా ఆడుకోకుండా అహర్నిశలూ కష్టపడుతున్నాం అని రొడ్డకొట్టుడు ప్రచారంతో హోరెత్తుస్తున్న నాయకులకు………నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజధాని శంకుస్థాపన సమయంలో నీళ్ళు, మట్టి ఇచ్చి అవమానించినా…….ఇప్పుడిక పూర్తిగా చిప్ప చేతికిచ్చినా ఎందుకు పౌరుషం రావడం లేదు? ఏ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మౌనంగా ఉంటున్నట్టు? సీమాంధ్ర హృదయాలు ఆవేదనతో రగిలిపోతుంటే చలిమంట కాచుకుంటూ ఉన్నవాళ్ళకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రేమ ఉంది అంటే ఇంకా నమ్మాలా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -