Thursday, May 16, 2024
- Advertisement -

దిక్కు దివాణం లేని జన చైతన్య యాత్ర .. 

- Advertisement -

 

Currency cancellation effect to TDP jana chaitanya yatra

పెద్ద నోట్ల ప్రభావం రాజకీయ పార్టీల మీద ఎంతగట్టిగా పడిందో తెలుసుకునేందుకు ఇది ఒక చిన్న ఉదాహరణ అని చెప్పచ్చు. తెలుగు దేశం పార్టీ లోకల్ గానే కాక దేశవ్యాప్తంగా కూడా తన వేళ్ళు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తోంది. పార్టీ నిర్మాణం కీలక దశలో ఉండగా వారికి ఇప్పుడు పెద్ద నోటు ప్రభావం గట్టిగా తగులుతోంది.

రాజకీయ పార్టీకి ప్రాణాధారం అయిన ప్రచారం చేసే క్రమంలో వచ్చిన పెద్ద నోట్ల రద్దు ప్రజలు అందరినీ ఇబ్బంది పెడుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన జన చైతన్య యాత్రల్లో పార్టీ నాయకులు వింత పరిస్థితి ఎదురుకొంటూ ఉన్నారు. ఈ నెల మొదట్లో అంటే ఒకటవ తారీఖు న ఈ యాత్రలు మొదలు పెట్టగా ప్రతీ నియోజికవర్గం లో నాయకులు ఫుల్ యాక్టివ్ గా పాల్గొన్నారు. ఎప్పుడైతే 8 వ తారీఖున మోడీ స్వయంగా ఈ పెద్ద నోటు వ్యవహారం బయటపెట్టారో అప్పటి నుంచీ సీన్ మొత్తం రివర్స్ అయిపొయింది. నోట్లు మార్చుకోవాల్సిన నాయకులు చాలామందే టీడీపీ లో ఉన్నారు.

తెలుగు దేశం లో ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉండడం తో ఈ పరిస్థితి కనిపిస్తోంది. రూ.500 – వెయ్యి రద్దు వల్ల ఒక వైపు వ్యాపారాలు గందరగోళంలో పడటం – మరో వైపు తమ వద్ద లిక్విడ్ క్యాష్ ను ఎలా మార్చుకోవాలో తెలియక చాలా మంది తీవ్ర అయోమయంలో పడ్డారు. కనీసం రూ.3 లక్షల నుంచి కోటి వరకూ వ్యక్తిగతంగా ఇళ్లలో – వ్యాపార సంస్థలో – రహస్య స్థావరాల్లో నిల్వ బెటుకున్న వారు వాటిని మార్చుకునేందుకు పలు ఎత్తుగడలు అవలంభించడంలో బిజీ అయిపోయారు. తద్వారా సభ్యత్వ నమోదు అటకెక్కినంత పనయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -