Sunday, May 19, 2024
- Advertisement -

జుట్టు రాలడానికి గల కారణాలు ఇవే!

- Advertisement -

మీరు స్నానం చేసేప్పుడు ఎక్కువగా జుట్టు చేతిలోకి ఊడి వస్తున్నా, లేదా తల దువ్వే టప్పుడు ఎక్కువ జుట్టు రాలుతున్నా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకొనే సమయం వచ్చిందని గమనించండి. విపరీతంగా జుట్టు రాలడానికి కారణాలున్నాయి. కారణాలు తెలుసుకొని వెంటనే పరిష్కరించుకోవాలి.

* ఒత్తిడి సైలెంట్ కిల్లర్. 25ఏళ్ళలోపు జుట్టు రాలిపోవడానికి ముఖ్య కారణం ఒత్తిడి. ఒత్తిడి వల్ల ప్రతి ఒక్క యవ్వనస్తుల్లో టాలోజెన్ ఎఫ్ల్యువిమ్ అనే ఎంజైమ్ జుట్టు రాలడానికి కారణం అవుతుంది. కాబట్టి ఒత్తిడి పెంచుకోకుండా… ప్రశాంతంగా జీవించాలి.

* ఎప్పుడైతే శరీరంలో విటమిన్స్ తక్కువైతాయో అప్పుడు శరీరంలో కనిపించే ఒకటి రెండు లక్షణాలు జుట్టు రాలడానికి ముఖ్య కారణాలు. 25ఏళ్ళలోపు అకస్మాత్తుగా ఎక్కువ జుట్టు రాలుతున్నట్లైతే . ఖచ్చితంగా విటమిన్ టెస్ట్ చేయించుకోవాలి. 

* ప్రోటీన్లు మన శరరీంను ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. మీ శరీరంలో ప్రోటీన్ల లోపం ఉంటుంది. క్రమంగా హెయిర్ ఫాల్ పెరుగుతుంది. కాబట్టి, డైలీ డైట్ ద్వారా ప్రోటీన్లను శరీరానికి అందివ్వడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.

* 25ఏళ్ళలోపు ఉన్న వారిలో జుట్టు ఎక్కువగా రాలుతుంటే అది జన్యుపరమైన సమస్యలు అయ్యుండవచ్చు. అయితే ఈ సమస్య చాలా రేర్ గా ఉంటుంది. 1-50లో మాత్రమే కనుగొనవచ్చు.

* హార్మోనుల అసమతుల్యత వల్ల జీవక్రియలు దెబ్బతినడంతో పాటు, జుట్టుకూడా ఎక్కువగా రాలుతుంది. 25ఏళ్ళలోపు ఎక్కువ జుట్టు రాలుతున్నట్లైతే అందుకు హార్మోనులు కూడా ప్రధాణ కారణం. జుట్టు రాలడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.

* జుట్టు రాలిపోడానికి మరో ముఖ్య కారణం థైరాయిడ్. కండరాల నొప్పులు, బరువు పెరగడం మరియు ఇతర లక్షణాలతో పాటు జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

* శరీరంలో విటమిన్ బి లోపం ఏర్పడినప్పుడు మీరు జుట్టును కోల్పోతారు. శరీరం యాక్టివ్ గా ఉండటానికి విటమిన్ బి ముఖ్య పాత్రపోషిస్తుంది. ఇంకా విటమిన్ బి రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషఫన్ కు అవసరం అవుతుంది. గుడ్లు, వెజిటేబుల్స్, చేపలు మరియు చేపలు తినడం వల్ల విటమిన్ లెవల్స్ పెరుగుతాయి.

* కొన్ని రకాల మందులు కూడా జుట్టు రాలడానికి ప్రధాణ కారణం. బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ ను ఉపయోగించే వారు హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతుంటారు.

Related

  1. మీ ప్రేమను మాటల్లో కాకుండా.. ఇలా ఎక్స్ ప్రెస్ చేయండి!
  2. యాంక‌ర్‌తో టాలీవుడ్ హీరో ప్రేమాయ‌ణం!
  3. ఫేస్‌బుక్‌ ప్రేమ రేప్ కేసుగా మారింది!
  4. కాలేజ్ అబ్బాయి ప్రేమలో కీర్తి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -