Sunday, May 19, 2024
- Advertisement -

కోదండరాం  విషయంలో కెసిఆర్ ఎందుకు బెదురుతున్నారు ? 

- Advertisement -
KCR Scared Of Kodandaram?

ప్రతీ ప్రారంభానికీ ఒక ముగింపు ఉంటుంది. ఆ విషయం బాగా తెలుసు కెసిఆర్ కి. తమ ప్రభుత్వానికి అహంకారం లేదు అనీ అందరినీ కలుపుకునే వెళతాం తప్ప ఎవ్వరితో గొడవ పెట్టుకోము అని చెబుతారు ఆయన. అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలే పాజిటివ్ గా ఉంటాయి అనేది కెసిఆర్ పాయింట్.

తమ రాష్ట్రం లో కొంగొత్త విధానాలతో ముందుకు వెళ్ళడం తమ ఆకాంక్ష తప్ప అందరితో గొడవలు పడ్డం పట్ల తనకి ఇంట్రెస్ట్ ఉండదు అంటూ ఉంటారు ఆయన. కెసిఆర్ ఇన్ని మాటలు చెప్పినా కోదండరాం విషయం లో మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తుంది. కెసిఆర్ నోటినుంచి ఏ విషయం బయటకి వచ్చినాకూడా అది కోదండరాం కి సంబంధించింది అయితే వ్యతిరేకంగానే ఉంటోంది. కేసీఆర్ లాంటి తెలివైన నేత.. కోదండం మాష్టారు దీక్ష చేసే అవకాశమే ఇవ్వకూడదు. సమర్థుడైన పాలకుడు ఎలా ఉండాలి? దీర్ఘకాలం అధికారం తన చేతుల్లో మాత్రమే ఉండాలని ఫీలయ్యే కేసీఆర్ లాంటి చతురత ఉన్న అధినేత ఎలా వ్యవహరించాలి? తాను తప్పులు చేసినా.. వేలెత్తి చూపలేని పరిస్థితిని సృష్టించుకోవాలి.

నిజానికి కొద్దికాలం క్రితం వరకూ అలాంటి పరిస్థితే ఉంది. ఉద్యమకారులు.. మేధావులు.. మీడియా అందరూ తనను తప్పు పట్టలేని వాతావరణాన్ని సృష్టించటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.అయితే.. తన ఈగోతో అలాంటి పరిస్థితి డిస్ట్రబ్ అయ్యేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్న వాదన ఇప్పుడు వ్యక్తమవుతోంది. గోరుతో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చుకున్న చందంగా.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని.. తన సలహాలతో సూచనల రూపంతో చెబుతున్న కోదండం మాష్టారి విషయంలో కాస్తంత పాజిటివ్ గా కేసీఆర్ వ్యవహరించి ఉంటే.. ఈ రోజున కోదండం మాష్టారి మీద పెల్లుబుకుతున్నసానుభూతి.. కేసీఆర్ సర్కారు మీద వస్తున్న విమర్శలు వచ్చి ఉండేవి కావన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తన పట్టును ఎక్కడా కోల్పోకుండా వ్యవహరిస్తున్న కేసీఆర్.. కోదండం మాష్టారి విషయంలో మాత్రం తప్పు మీద తప్పు చేయటం కనిపిస్తోందన్న విమర్శ ఉంది. ప్రతి అంశాన్ని వ్యూహాత్మకంగా ఎదుర్కొనే కేసీఆర్.. మాష్టారి ఇష్యూలో మాత్రం బ్యాలెన్స్ ఎందుకు మిస్ అవుతున్నారు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -