Monday, May 20, 2024
- Advertisement -

ఇటు స్నేహం.. అటు వైరం

- Advertisement -

ఎవరితో ఎలా మెలిగితే.. లాభం చేకూరుతుందో తెలుసుకోవాలంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే.. ఇటు రాష్ట్రంలో రాజకీయాల పరంగా భారతీయ జనతా పార్టీతో వైరం పెట్టుకుంటారు.

చాన్స్ దొరికితే చాలు… మాటల తూటాలు పేలుస్తుంటారు. తమను విమర్శిస్తే.. అంతకు రెండింతలు విమర్శించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇదే టైమ్ లో… అదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో మాత్రం దోస్తీ కంటిన్యూ చేస్తారు. వీలైనంత వరకూ రాష్ట్రానికి ప్రయోజనాలు కలిగించుకునే ప్రయత్నం చేస్తారు.

రీసెంట్ గా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. ఈ మాట అక్షర సత్యం అని ఎవరైనా ఒప్పుకుంటారు. ఎందుకంటే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న.. అందిన నిధుల గురించి.. రీసెంట్ గా బీజేపీ చీఫ్ అమిత్ షా.. తెలంగాన పర్యటనలో లెక్కలతో సహా వివరించారు. కేంద్రం నిధులు ఇస్తున్నా.. రాష్ట్రం మాత్రం వాటి గురించి మాట మాత్రం బయటపెట్టడం లేదనే అర్థం వచ్చేలా.. పార్టీ నేతలు కూడా మాట్లాడారు. ఇదే.. టీఆర్ఎస్ నేతలకు కోపం తెప్పించింది. వాస్తవంగా ఎన్ని నిధులు ఇచ్చారో చెబుతాం.. చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ నేతలకు సవాల్ చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. దీంతో.. రాజకీయంగా ఈ రెండు పార్టీల మధ్య అగ్గి రాజుకుంది.

ఈ ఇష్యూ కాస్త పక్కన పెడితే.. ప్రభుత్వాల పరంగా ఇటు రాష్ట్రం, అటు కేంద్రం మధ్య మంచి అవగాహన ఉన్నట్టే కనిపిస్తోంది. రీసెంట్ గా.. తెలంగాణకు కరీంనగర్ రూపంలో మరో స్మార్ట్ సిటీ ప్రకటించడం.. ఆ వెంటనే హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ నాగ్ పూర్ ఏరియాల్లో పారిశ్రామిక కారిడార్లకు అనుమతిస్తూ మరో ప్రకటన చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి. 

ఇక.. హైదరాబాద్ లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా.. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ బాగుందంటూ మెచ్చుకున్నారు. తన పరిధిలో చేయగలిగిన సాయం చేస్తానంటూ హామీ కూడా ఇచ్చి వెళ్లారు. సో.. ఇవన్నీ గమనిస్తుంటే.. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తున్నట్టే లెక్క అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ లెక్కల ప్రకారం.. రాజకీయానికి రాజకీయం.. ప్రభుత్వానికి ప్రభుత్వం అన్నట్టు టీఆర్ఎస్ లెక్కలు సాగుతున్నాయని.. ఇది కేసీఆర్ రాజకీయ చాతుర్యానికి నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -