Saturday, May 18, 2024
- Advertisement -

వామ్మో వాట్స్ యాప్ ని బ్యాన్ చేస్తారట !

- Advertisement -

తెల్లారి పళ్ళు తోముకోక ముందే , ఆ మాటకి ఒస్తే కళ్ళు కూడా తెరవక ముందరే ఫోను వెతుక్కుని వాట్స్ యాప్ ఓపెన్ చేస్తాం మనం అందరం. ఒకప్పుడు ఫేస్ బుక్ కి ఎడిక్ట్ అయిన మనం ఇప్పుడు వాట్స్ యాప్ పిచ్చిలో పడి కొట్టుకుంటున్నాం. వాట్సాప్ లేకపోతే నిద్ర పట్టని మన జీవితాలకి ఇది ఒక షాకింగ్ న్యూస్ లాగా వినిపిస్తోంది.

సోషల్  నెట్వర్కింగ్ లో సరైన రూల్స్ పాటించక పోతే వాటిని దేశం మొత్తం మీద బ్యాన్ చేసే అధికారం కేంద్రం లోని టెలీకాం వారికి ఉంటుంది. సో వాట్స్ యాప్ కొత్తగా పెట్టిన ఫీచర్ ఈ తలనొప్పులు తెస్తోంది. ఇటీవల కాలంలో వాట్సప్ ‘‘ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్’’ అంటూ ఒక కొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో వినియోగదారుల సమాచారానికి పూర్తి భద్రత అని వాట్సప్ పేర్కొంటోంది. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ సాంకేతికత వినియోగానికి ట్రాయ్ అనుమతి ఉండదని చెబుతున్నారు.

దేశంలోని ఆన్ లైన్ సర్వీసుల్లో 40 బిట్ ఎన్ క్రిప్షన్ ను మాత్రమే వినియోగించాలని.. తాజాగా వాట్సప్ వినియోగించిన సాంకేతికత 256 బిట్ అని.. ఇది ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెబుతున్నారు. 

ఎక్కువ బిట్స్ పెట్టడం వలన హ్యాకింగ్ అవకుండా ఉంటుంది అనేది వాట్స్ యాప్ వారి వాదన కాగా ట్రాయ్ దృష్టిలో మాత్రం ఇది రూల్ ని అధిగమించడమే అంటున్నారు విశ్లేషకులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -