Saturday, May 18, 2024
- Advertisement -

లోకేష్-శేఖరరెడ్డి…… పవన్ చెప్పిన అవినీతి బాగోతం అసలు కథ ఇదా…?

- Advertisement -

తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి జరుగుతోందన్నది నిజం. భవిష్యత్ తరాల విషయం పక్కనపెడితే ప్రస్తుతం నివాసం ఉంటున్నవాళ్ళకు కూడా మట్టి, ఇసుక, నీళ్ళతో సహా ఏవీ కూడా సామాన్య ప్రజలకు అందని స్థాయికి అవినీతి పాలకులు తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ చూసినా అవినీతి కంపు. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సహా టిడిపి ఎమ్మెల్యేలను, నాయకులను కూర్చోబెట్టి అవినీతి పంపకాలు ఎలా ఉండాలో స్వయానా ముఖ్యమంత్రే వివరించిన దౌర్భాగ్య స్థితి. ఈ మొత్తం పాపానికి తాను కూడా బాధ్యుడిని అని పవన్ రియలైజ్ అయ్యాడో ఏమో కానీ లోకేష్ అవినీతితో మొదలెట్టి బాబు సారథ్యంలోని టిడిపి ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను పూర్తిగా ఎండగట్టేశాడు పవన్.

పవన్ చెప్పిన అంశాలన్నింటిలోకి శేఖరరెడ్డి-లోకేష్‌ల అవినీతి బంధం మాత్రం చాలానే చర్చనీయాంశం అవుతోంది. వేల కోట్ల వ్యవహారమైన అవినీతి బాగోతం ఏంటంటే…….

చంద్రబాబునాయుడు న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయడం గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు. దేశంలో ఉన్న మేధావులు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఇప్పటికే చాలా చెప్పారు. ఢిల్లీలో ఉన్న న్యాయ వ్యవస్థకు సంబంధించిన పెద్దాయనకు చంద్రబాబుకు ఉన్న బంధం గురించి అందరికీ తెలుసు. చంద్రబాబుపై ఉన్న చాలా కేసుల్లో స్టేలు రావడానికి, కొన్ని కేసులు ఎత్తేయడానికి ఆ పెద్దాయనే కారణం. అసలు టిడిపి పార్టీ నిధులు, పార్టీ గుర్తు కూడా చంద్రబాబుకు రావడానికి ఆయనే కారణం. అప్పట్లో ఎన్టీఆర్ తరపున పనిచేస్తున్నట్టుగా ఎన్టీఆర్‌ని నమ్మించిన ఆ పెద్దమనిషి పూర్తిగా ఎన్టీఆర్‌ని నమ్మించి మోసం చేస్తూ పార్టీ గుర్తు, పార్టీ, పార్టీ నిధులు అన్నీ కూడా చంద్రబాబుకు వచ్చేలా చేశాడు.

తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖనేతకు బెయిల్ ఇప్పించడం కోసం లోకేష్ ద్వారా ఆ పెద్దాయనను కలిశాడు శేఖరరెడ్డి. లోకేష్, శేఖరరెడ్డిలు కలిసి ఆ పెద్దాయన మధ్యవర్తిత్వంతో బెయిల్ డీల్ కుదర్చడానికి వేల కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది ఢిల్లీలో ఉన్న పరిశోధనాత్మక కథనాలు రాసే జర్నలిస్టులు తేల్చిన విషయం. ఇదే విషయంపై మోడీ దగ్గర కూడా పూర్తి సాక్ష్యాలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయన్నది సీనియర్ జర్నలిస్టులు చెప్తున్న విషయం. లోకేష్‌కి కూడా శేఖరరెడ్డి భారీగా ముడుపులు చెల్లించాడు. ఇక శేఖరరెడ్డి కూడా చంద్రబాబుకు అనుంగు మిత్రుడయ్యాడు. శేఖరరెడ్డితో నారావారి అవినీతి సావాసం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగింది.

అయితే ఈ మొత్తం వ్యవహారంపై మోడీ ఎందుకు సీరియస్ అయ్యాడో….. నోట్ల రద్దు తర్వాత ఆంధ్రప్రదేశ్ నాట కొత్త నోట్లు దొరక్కపోవడానికి కారణం ఏంటో….. ఈ మొత్తం వ్యవహారంలో శేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు, లోకేష్‌ల అవినీతి వ్యవహారం ఏంటో ఇంకో ఆర్టికల్‌లో చెప్పుకుందాం. అసలు మోడీకి-చంద్రబాబుకు వ్యవహారం చెడిపోవడానికి ప్రధాన కారణంగా ఢిల్లీ స్థాయిలో వినిపిస్తున్న ఆ వాస్తవాలను మరో ఆర్టికల్‌లో చెప్పుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -