Wednesday, May 15, 2024
- Advertisement -

అదే జరిగితే.. కేసీఆర్ పై ఆ పార్టీలది తిరుగులేని విజయమే!

- Advertisement -

తలసాని విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితిపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొస్తున్నాయి తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన తలసాని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఎలా భాగస్వామి అవుతాడు?

ఆ పార్టీ తరపున ఏ విధంగా మంత్రి పదవిని చేపడతాడు? అనేది ప్రతిపక్ష పార్టీలు సంధిస్తున్న ప్రశ్న.

ఈ ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర సమితి వైపు నుంచి సమాధానం లేదు. కొన్ని నెలలుగా ఈ విషయంలో తెలుగుదేశం, కాంగ్రెస్ వంటి పార్టీలు ప్రశ్నిస్తున్నా కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో.. ఇప్పుడు ఆయా పార్టీలు కేసీఆర్ పై దాడిని తీవ్రం చేశాయి. తలసాని చేత రాజీనామా చేయించాల్సిందేనని ఆ పార్టీలు పట్టుబడుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ లకు కూడా ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. తలసాని విషయంలో చర్యలు తీసుకోవాలని కోరాయి. వారి సంగతి ఎలా ఉన్నా..ఇ ప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా కొంత ఒత్తిడికి గురి అవుతుందనే అనుకోవాలి. తలసాని విషయంలో సమాధానం చెప్పక తప్పని పరిస్థితినే ఎదుర్కొంటోందని అనుకోవాలి.

మరి ఇప్పుడు కేసీఆర్ కూడా తలసాని చేత రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నాడట. ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడితో మరో మార్గం లేక కేసీఆర్ తలసాని చేత రాజీనామా చేయించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. మరి ఇదే గనుక జరిగితే కేసీఆర్ కు ఎదురుదెబ్బే అవుతుంది. కేసీఆర్ పై తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు సాధించిన పెద్ద విజయమే అవుతుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -