Wednesday, May 15, 2024
- Advertisement -

మాటల్లో కాదు….. చేతల్లో…. దమ్మున్న ఒకే ఒక్క నాయకుడు జగన్

- Advertisement -

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అందరు నేతలూ కూడా పోరాటం చేస్తున్నాం అని సీమాంధ్రులను నమ్మించడానికే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబేమో 14 రోజులుగా తాను అజ్ఙాతవాసంలో ఉంటూ తన భజన మీడియాతో సినిమాను నడిపిస్తున్నాడు. పోరాటం చేస్తా అని ప్రగల్భాలు పలికిన పవన్……24గంటలు తిరిగేసరికి జేఏసీ కాదు జేఎఫ్‌సీ అంటూ సేఫ్‌గా అధ్యయనం, కమిటీలు అంటూ కాలక్షేప వ్యవహారానికి తెర తీశాడు. కాంగ్రెస్‌తో పాటు కమ్యూనిస్ట్ నాయకులు కూడా పోరాటం అని చెప్పి నాలుగు మాటలు చెప్పడమే తప్పితే కార్యాచరణ ప్రణాళిక ప్రకటించినవాళ్ళు ఎవరూ లేరు. వైఎస్ జగన్ ఒక్కడే కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాడు.

పోరాటం అంటే మీడియా ముందు మాటలు చెప్పడమో, ప్రచారం కోసం పాకులాడడమో, ఏదో చేస్తున్నామని చెప్పి జనాలను నమ్మించడమో కాదు. అలా చేసి ఉంటే తెలంగాణా ఎప్పటికీ వచ్చి ఉండేది కాదు. కానీ కెసీఆర్ ఆచరణాత్మక విధానంతో ఉద్యమం చేశాడు. ఇప్పుడు జగన్ కూడా అలాంటి ఉద్యమ కార్యాచరణే ప్రకటించాడు. రాజీనామాలు రాజకీయ లబ్ది కోసం అని విమర్శించేవాళ్ళంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకెవరూ ఉండరు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల మెప్పు పొందడానికి ప్రయత్నిస్తాడు. తద్వారా రాజకీయ లబ్ధి కూడా ఆశిస్తాడు. అలాంటప్పుడు ఎంపిల రాజీనామాలు, ఢిల్లీ వేదికగా ధర్నా, రాష్ట్రంలో ఆందోళనలు అంటూ ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణకు దిగిన జగన్‌కి రాజకీయ లబ్ధి కలిగితే మాత్రం నష్టం ఏంటి? జగన్‌కి కాకపోతే 14 రోజులుగా అజ్ఙాతంలో ఉంటూ భజన మీడియాతో ఉద్యమం చేస్తున్నట్టుగా బిల్డప్పులు ఇస్తున్న చంద్రబాబుకి కలగాలా? లేకపోతే నాలుగేళ్ళ అన్యాయం తర్వాత కూడా అధ్యయనం, కమిటీలు అంటూ ఎన్నికల వరకూ కాలయాపన మార్గాన్ని ఎంచుకున్న పవన్‌కి కలగాలా? లేక అప్పుడప్పుడూ తెరపై కనిపించే కాంగ్రెస్, కమ్యూనిస్టులకు రాజకీయ ప్రయోజనం కలిగేలా చెయ్యాలా?

ఇక జగన్ మోడీతో కుమ్మక్కయ్యాడు అనే అర్హత చంద్రబాబుకు అస్సలు ఉండదు. మోడీతో పొత్తు ఇంకా కొనసాగిస్తూ, కేంద్ర కేబినెట్‌లో తన పార్టీ కేంద్ర కేబినెట్ మంత్రుల చేతే ఆంధ్రప్రదేశ్‌కి చిప్ప చూపించిన బడ్జెట్‌కి ఓట్లేయించిన చంద్రబాబుకి మోడీతో జగన్ కుమ్మక్కయ్యాడు అనే అర్హత ఉంటుందా? విభజన నాడు కూడా ఇదే కథ. తెలంగాణాలో కూడా రాజకీయ ప్రయోజనాలు ఆశించిన చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ సోది కబుర్లు చెప్పి సీమాంధ్రులను నిండా ముంచాడు. తెగించి సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్ష చేసిన జగన్‌పై మాత్రం సోనియాతో కుమ్మక్కయ్యాడని ముద్ర వేశాడు. తీరా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టింది, చిదంబరాన్ని ప్రత్యేకంగా కలిసింది చంద్రబాబు. సోనియా ప్రధాన కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో మంతనాలు జరిపింది సుజనా చౌదరి. అయినప్పటికీ జగన్‌పై విష ప్రచారం చేసి 2014లో సీమాంధ్రుల ఓట్లు కొల్లగొట్టారు. ఇప్పుడు కూడా అదే కథ. ఒకవైపు సిగ్గులేకుండా సాగిలపడి మరీ మోడీతో పొత్తు కొనసాగిస్తూ……డైరెక్టర్‌గా ప్రజల ముందుకు వచ్చి మోడీ పేరెత్తలేని బాబు 14 రోజులుగా పచ్చ మీడియాతో డ్రామాలు ఆడుతున్నాడు. అధికారంలో ఉన్న బాబు చేతకానితనం అది. అలాంటి చంద్రబాబుకు మోడీతో జగన్ కుమ్మక్కయ్యాడని విమర్శించే అర్హత ఉందా?

చివరిగా కంటికి కనిపిస్తున్న నిజం ఒక్కటే. సీమాంధ్ర ప్రయోజనాల కోసం ప్రత్యక్ష పోరాట కార్యాచరణను ప్రకటించిన ఒకే ఒక్క దమ్మున్న నాయకుడు జగన్. పవన్‌తో సహా ఇతర నాయకులందరూ కూడా జగన్‌కి ఎక్కడ క్రేజ్ వస్తుందో అని, సీమాంధ్రులు జగన్‌వైపు ఎక్కడ స్టాండ్ తీసుకుంటారో అని చెప్పి చంద్రబాబు తరపున డ్రామాలు ఆడుతున్నవాళ్ళే. అన్ని నిజాలు సీమాంధ్ర ప్రజల కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. కంటికి కనిపించే నిజాలనే నమ్మండి. మీడియా వాళ్ళు తెరవెనుక విషయాలు అంటూ చెప్పే కబుర్లు అస్సలు నమ్మొద్దు. అందరివీ స్వార్థ ప్రయోజనాలే. అందుకే ఈ సారి అయినా కంటికి కనిపిస్తున్న నిజాలనే విశ్లేషించుకుని సీమాంధ్రులు తమ కోసం ఎవరు ఎక్కువగా పోరాటం చేశారు….ఏ నాయకుడు ఎక్కువగా తమ మధ్య ఉన్నాడో….మిగతా అందరికంటే ఏ నాయకుడు ఎక్కువ సమయం తమ కోసం పోరాటం చేశాడో ఆ నాయకుడికి అండగా నిలబడతారని కోరుకుందాం. తెలంగాణా ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గురించి ఎన్నో ఆరోపణలు వచ్చాయి. మంత్రి పదవి రాలేదనే తెరాసను స్థాపించాడన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసమే అన్నారు. కానీ తెలంగాణా ప్రజలు మాత్రం కాంగ్రెస్, టిడిపి, కమ్యూనిస్టులు, బిజెపి పార్టీల నాయకులకంటే ఎక్కువ సమయం…….ఎక్కువ చిత్తశుద్ధితో తమ కోసం పోరాడిన కేసీఆర్‌కే పట్టం కట్టారు. ఇప్పుడు ఆ నిర్ణయం తాలూకూ అభివృద్ధి ఫలాలు కూడా కళ్ళ చూస్తున్నారు. సీమాంధ్రులు కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అలా కాకుండా మీడియా డ్రామాలతో రాజకీయాలు చేసేవాళ్ళకు, సినిమా వేషాలకు మరోసారి మోసపోతే మాత్రం మరో ఐదేళ్ళ తర్వాత సీమాంధ్రుల కష్టాలు ఊహించడం కూడా కష్టమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -