Saturday, May 18, 2024
- Advertisement -

టుడే స్పెషల్ : అక్టోబర్ 3 కు ఉన్న ప్రత్యేకతలేంటో తెలుసా ?

- Advertisement -

స్వామి రామానంద జననం : భారత స్వాతంత్ర్య సమర యోధుడు స్వామి రామానంద తీర్థ అక్టోబర్ 3, 1903 లో జన్మించారు. చివరి నిజాం ఉస్మాన్ అలీ హయాంలో హైదరబాద్ విముక్తి కోసం పోరాటం సాగించిన వారిలో రామానంద ముఖ్య భూమిక పోషించాడు. హైదరబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రధాన నాయకుడిగా ఉంటూ రాజకీయ వేత్తగా పేరు ఘడించారు.

ఇరాక్ స్వాతంత్ర్యం : ఇరాక్ లో ప్రతిఏటా అక్టోబర్ 3 స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. బ్రిటన్ నుంచి ఇరాక్ 1932 అక్టోబర్ 3 న అధికారికంగా స్పతంత్ర్యం పొందింది. దీంతో ఈ రోజున ఇరాక్ లో అన్నీ కార్యాలయాలలు, విద్యా సంస్థలు, పోస్ట్ ఆఫీస్ లు, మూసివేయబడతాయి.

బొక్వెరాన్ యుద్ద దినం : 1932 లో బొలీవియా మరియు పరాగ్వే ల మద్య మూడు వారాల పాటు జరిగిన యుద్దంలో పరాగ్వే పై చేయి సాధించింది. దీంతో పరాగ్వేలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 3న బొక్వెరాన్ బాటిల్ విక్టరీ డే గా జరుపుకుంటారు.

బాయ్ ఫ్రెండ్ దినోత్సవం : అక్టోబర్ 3న జాతీయ బాయ్ ఫ్రెండ్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున తను ప్రేమించిన ప్రియుడిపై ఎంత ప్రేమ ఉందో ప్రియురాలు తెలియజేసే రోజు. ఇక ఆగష్టు 1 న జాతీయ గర్ల్ ఫ్రెండ్ దినోత్సవంగా జరుపుకుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -