Sunday, May 5, 2024
- Advertisement -

టుడే స్పెషల్ : మీరు ఒడ్కా తాగుతారా.. ఈ రోజు మీకోసమే !

- Advertisement -

ప్రపంచంలో ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ విధంగా అక్టోబర్ 4 కు ఉన్న ప్రత్యేకతలు కొన్ని తెలుసుకుందాం !

జాతీయ ఒడ్కా దినోత్సవం : మద్యం ప్రియులకు అత్యంత ఇష్టమైన పానీయాలలో ఒడ్కా ఒకటి. ఒడ్కా తాగడం అనేది చాలా మంది స్టేటస్ గా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒడ్కాలో వాడే ఇంగ్రీడియన్స్ అనగా సంప్రదాయకంగా నీటిలో కలిపే స్వేదన ధాన్యాలు లేదా బంగాళాదుంపల మిశ్రమం ద్వారా ఒడ్కా ను తయారుచేస్తారు. అందువల్ల ఆ పానీయం దుర్వాసనను వ్యాపింపజేయదు. అందుకే చాలా మంది ఒడ్కా తగేందుకు అమితంగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఒడ్కా ఎక్కువగా రష్యా నుంచి ఇతర దేశాలకు వ్యాపించింది. అత్యంత ఖరీదైన ఒడ్కా రకాలన్నీ రష్యా నుంచి మాత్రమే వస్తాయి. అక్టోబర్ 4 న రష్యాలో జాతీయ ఒడ్కా దినోత్సవంగా జరుపుకుంటారు. మొదట్లో రష్యాలో మాత్రమే ప్రారంభం అయిన ఈ ఫెస్టివల్ ఇప్పుడు చాలా దేశాలకు వ్యాపించింది.

ప్రపంచ జంతు దినోత్సవం : చాలమంది జంతువులపై అమితమైన ప్రేమ కనబరుస్తూ ఉంటారు. జంతువులు కూడా తమ యజమానులపై అంటే ప్రేమను కనబరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన ఇళ్ళలో పెంచుకునే కుక్క , పిల్లి, ఆవులు, మేకలు వంటి జంతువులపై మాత్రమే కాకుండా అడవిలో పెరిగే ఆయా రకాల జంతువులపై కూడా జంతు ప్రేమికులు ప్రేమను కనబరుస్తూ ఉంటారు. అలాంటి జంతు ప్రేమికుల కోసం అక్టోబర్ 4 న ప్రపంచ జంతు దినోత్సవంగా జరుపుకుంటారు. అక్టోవర్ 4, 1931 లో మొదట ఇటలీలో ప్రారంభం అయిన ఈ వార్షిక ఉత్సవం.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. జంతువుల హక్కులతో పాటు వాటి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడం ” ప్రపంచ జంతు దినోత్సవం ” యొక్క ముఖ్య ఉద్దేశం.

అక్టోబర్ 4 కు ఉన్న మరి కొన్ని ప్రత్యేకతలు
*తెలుగు వారికి అత్యంత సుపరిచితమైన సంపూర్ణ పెద్ద బాలశిక్ష గాజుల సత్యనారాయణ జననం.
*టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ జననం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -