Tuesday, April 30, 2024
- Advertisement -

టుడే స్పెషల్ : దసరా రోజున ఈ పనులు అసలు చేయకండి !

- Advertisement -

దసరా పండుగ గురించి అందరికీ తెలిసిందే. దుర్గా మాత మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించడం వల్ల చెడుపై మంచి జయించిన విజయంగా విజయదశమిని జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు జరిగీ నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజున అనగా దశమి నాడు దసరా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజున భక్తి శ్రద్దలతో దుర్గా దేవిని పూజిస్తారు భక్తులు. అయితే ఈ దసరా పండుగ రోజున చేయకూడని పనులు కూడా ఉన్నాయని, వాటిని చేయడం వల్ల దుర్గా మాత అనుగ్రహం దురమౌతుందని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం !

సాధారణంగా పండుగ సమయాల్లో కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేయడానికి ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. అయితే ఇలా బయటకు వెళ్ళేటప్పుడు ఇంటికి సంబంధించిన వారు కనీసం ఒక్కరైనా ఇంటిదగ్గరే ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇంట్లో పూజా చేసి, అఖండ జ్యోతి వెలిగించిన తరువాత దుర్గా మాత కటాక్షం ఆ ఇంటి పై ఉంటుందని.. అలాంటి సమయంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఒకవేళ బయటకు వెళితే దుర్గా మాత కటాక్షం దూరమౌతుందట.

ఇక నవరాత్రుల్లో భాగంగా ఇంట్లో ఉపయోగించే ఆహార పదార్థాలలో వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి వాటిని దూరంగా ఉంచాలట. అంతే కాకుండా పండితులు చెబుతున్నా దాని ప్రకారం నిమ్మకాయ కూడా కోయకూడట. ఎందుకంటే నిమ్మకాయ అనేది దుర్గా దేవికి అత్యంత ఇష్టమైన పదార్థం. అందుకే దుర్గాదేవికి నిమ్మకాయలతో దండ వేయడం మనం చూస్తూ ఉంటాం. అందువల్ల నిమ్మకాయను కొస్తే దుర్గాదేవి ఆగ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు.

అందువల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పైన చెప్పిన సూచనలను తప్పక పాటించాలని.. అప్పుడే దుర్గాదేవి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -