Monday, May 20, 2024
- Advertisement -

వాట్సాప్ లో సూపర్ ఫీచర్

- Advertisement -

ప్రస్తుతం వాట్సప్ వాడి వ్యక్తి లేడు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు.. వాట్సాప్‌ లోనే ఉంటున్నారు. ఏ మాత్రం ఖాళీ టైంగ్ దొరికిన.. ప‌నిలో ఏ మాత్రం బ్రేక్ ల‌భించినా.. వాట్సాప్‌ లో ఏమైనా మెసేజ్ లు వ‌చ్చాయా? అని చూసుకోవ‌ట‌మే కనిపిస్తోంది.

ఈ రెంజ్ లో వాట్సాప్ ప్రజల్లోకి వెళ్లింది. అయితే ఈ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ తో యూజర్లను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఫోన్ లో మెసేజ్ లు పంప‌టం మొద‌టి నుంచి ఒక క‌ల‌లాంటి ఫీచ‌ర్ గురించి వినియోగ‌దారులు క‌ల‌లు క‌నేవారు. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటంటే.. పంపిన మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవ‌టం.. లేదంటే డిలీట్ చేసుకోవ‌టం. పంపిన మేసేజ్ పొర‌పాటు ఉన్నా.. త‌ప్పు అర్థం వ‌చ్చేలా ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించిన వెంట‌నే డిలీట్ చేసుకునే ఆప్ష‌న్ ఉంటే ఎంత బాగుండు అన్న భావ‌న త‌ర‌చూ వ‌స్తుంటుంది.

రీసెంట్ గా అదే ఫీచర్ విషయంలో వాట్స‌ప్ పెద్ద అడుగు వేసిన‌ట్లుగా చెబుతున్నారు. రీకాల్‌.. రీవోక్ పేరుతో వాట్సాప్ ఆ సౌక‌ర్యాన్ని త‌న వినియోగ‌దారుల‌కు ఇచ్చేందుకు వీలుగా ప్లాన్ చేస్తోంది. ఇప్ప‌టికే కొన్ని విండోస్ ఫోన్ల‌లో బీటా వెర్ష‌న్ వాడుతున్న వారికి స‌రికొత్త సౌల‌భ్యం ల‌భించ‌నుంది. త్వ‌ర‌లోనే ఆండ్రాయిడ్‌.. ఐవోఎస్ వినియోగ‌దారుల‌కు ద‌రి చేర‌నుంది. ఈ కొత్త ఫీచర్ వచ్చేసిన తర్వాత ఎవరికైనా పొరపాటున మెసేజ్ తీసేసుకునే వీలు ఉంటుంది. ఒక వినియోగదారుడు పంపిన మేసేజ్ లను అవతల వాడు చూడనంత వరకు ఆ మేసేజ్ ను డిలీట్ చేయటమో.. ఎడిట్ చేసుకునే ఆప్ష‌న్ ల‌భించ‌నుంది. వాట్సాప్ యూజర్లను ఇంతకు మించిన ఫీచర్ మరొకటి ఉండదేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -