Tuesday, May 14, 2024
- Advertisement -

ముఖ్యమంత్రి పదవి ఊడుతుందని చంద్రబాబు ఏ స్థాయిలో భయపడ్డాడంటే?

- Advertisement -

హైటెక్ ముఖ్యమంత్రి…..సాంకేతికతను వినియోగించుకోవడంలో అగ్రగణ్యుడు. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు అని చంద్రబాబు ఇమేజ్‌ని జనాల మెదళ్ళలో నిలిచిపోయేలా చేయాలని పచ్చ మీడియా జనాలు నానా తంటాలూ పడుతుంటారు. కానీ చంద్రబాబును దగ్గర నుంచి చూస్తున్నవాళ్ళు మాత్రం పూర్తిగా రివర్స్‌లో చెప్తూ ఉంటారు. ఒక స్మార్ట్ ఫోన్‌ని ఆపరేట్ చేయడం కూడా చంద్రబాబుకు రాదని, అలాగే టెక్నాలజీ గురించి కూడా తన ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల కష్టాన్ని తన క్రెడిట్‌గా చెప్పుకుంటూ ఉంటాడని టిడిపి జనాలే చెప్తూ ఉంటారు. ఇక చంద్రబాబుకు ఇంగ్లీషు భాష రాదన్న విషయం తెలిసిన విషయమే. ఇంగ్లీష్ రాకపోతే తప్పా అని టిడిపి జనాలు వాదిస్తారు కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో ఇంగ్లీష్ ప్రాధాన్యం ఎంతో తెలిసి ఉన్నవారు మాత్రం ఇంగ్లీష్ రాకుండా టెక్నాలజీ కింగ్ అని పేరు తెచ్చుకున్నారంటే అసలు మర్మం ఏమై ఉంటుందనే విషయం ఇట్టే పసిగట్టగలరు.

ఆ విషయం పక్కన పెడితే సైన్స్ గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులు గొప్పగా చెప్తూ ఉండే చంద్రబాబుకు ఉన్నన్ని భయాలు, మూఢ నమ్మకాలు ఇంకెవ్వరికీ ఉండవు అన్నది నిజం. ఈ విషయంలో ఆయన వియ్యంకుడు బాలయ్యను మించిపోతాడు చంద్రబాబు. సిఎం కుర్చీ కోసం ఏం చేయడానికైనా …..ఎందరిని మోసం చేయడానికైనా రెడీ అయిపోయే చంద్రబాబు…..అదే సిఎం కుర్చీ దూరమైపోతుందనే భయం స్టార్ట్ అయితే చాలు….. ఆగమేఘాలపై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. తాజాగా మరోసారి సిఎం కుర్చీ దూరమవుతుందనే భయం చంద్రబాబు చేత అలాంటి నిర్ణయం తీసుకునేలా చేసింది. బిజెపి మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నాడు చంద్రబాబు. ఒక ఫిరాయింపు ఎమ్మెల్యేతో పాటు ఒక టిడిపి ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి కట్టబెట్టనున్నాడు చంద్రబాబు. అయితే నిన్న ఒక చంద్రబాబు బాగా నమ్మే ఒక జ్యోతిష్యుడు……‘దేవాదాయ శాఖ మంత్రి పదవి నీ దగ్గరే ఉంచుకుంటే ముఖ్యమంత్రి పదవికి గండం వస్తుంది’ అని చెప్పాడట. సమైక్యాంధ్రప్రదేశ్ నాటి నుంచీ ఉన్న పరిస్థితులు చూసుకున్నా కూడా దేవాదాయ శాఖ మంత్రి పదవిని కూడా చేపట్టిన సందర్భాల్లో కొంతమందికి ముఖ్యమంత్రి పదవి ఊడిందని గుర్తుచేశాడట. ఆ వెంటనే నిమిషాల వ్యవధిలో చంద్రబాబు రియాక్ట్ అయ్యాడు. తన దగ్గర ఉన్న దేవాదాయ శాఖ మంత్రి పదవిని ఉప ముఖ్యమంత్రి కె.ఈ. కృష్ణమూర్తికి బదిలీ చేస్తూ హడావిడిగా నిర్ణయం తీసుకున్నాడు.

ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరగా పరిశీలించిన టిడిపి మంత్రులు మాత్రం……..‘ఔరా……ముఖ్యమంత్రి కుర్చీ అంటే చంద్రబాబుకు ఎంత ఇష్టమో కదా……’ అని సెటైరికల్‌గా మాట్లాడుకోవడం గమనార్హం. ఇలాంటి చంద్రబాబు మీడియా ముందు, ప్రజల ముందు మాత్రం ‘అధికారంపై యావ అస్సలు లేదు…… నేను చూడని పదవులు ఏమున్నాయి…… నేనో గొప్ప సాధువులాంటి వాడిని’ అని చెప్తూ ఉండడంపై మాత్రం ఈ విషయం తెలిసిన రాజకీయ విశ్లేషకులు మరోసారి చంద్రబాబు పదవీ కాంక్ష, పదవీ స్వార్థం గురించి మాట్లాడుకునేలా చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -