Saturday, May 18, 2024
- Advertisement -

గ‌త ముఖ్య‌మంత్రుల మాదిరిగానె జ‌గ‌న్‌కు కూడా అదృష్టం వ‌రిస్తాదా…?

- Advertisement -

రాజకీయాలన్నాక ఎన్నో సెంటిమెంట్లుంటాయి. వాహనాల నెంబర్లు ఒకేలా ఉండేట్లు చూసుకోవటం, కొందరైతే నెంబర్లలో సరి సంఖ్య, బేసిసంఖ్యను కూడా చూసుకుంటారు. అటువంటిదే సంఖ్యాశాస్త్రం ప్రకారం (న్యూమరాలజీ) పేర్లలో మార్పులు చేసుకోవ‌డం సాదార‌నం అయ్యింది.తాజాగా జ‌గ‌న్‌మోమ‌న్ రెడ్డికూడా పేరు మార్చుకున్న‌ట్లు ప్ర‌చారం ముమ్మ‌రంగా జ‌రుగుతోంది. పేరు మార్చుకోవ‌డం కాదు ప‌లికె విధానంలో మార్పు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

సెలబ్రిటీలలోనే కాకుండా రాజకీయ నేతల్లో కూడా ఈ నమ్మకం పెరుగుతున్నట్లే కనబడుతోంది. గ‌తంలో కూడా మూడ‌క్ష‌రాల పేరుతోఉన్న నేత‌లు సీఎంలుగా కొన‌సాగారు. త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి మరుదూరు గోపాల రామచంద్రన్ సింపుల్‌గా (ఎంజీఆర్ ) అని పిలుస్తారు. ఆపేరుతోనె ఆయ‌న స్టార్‌గా ఎదిగారు. త‌మిళ సినిమా రంగములో ప్రముఖ నటుడు మరియు 1977 నుండి ఆయన మరణించేంతవరకు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అత్యంత ప్ర‌జాద‌ర‌న క‌లిగిన నాయ‌కుడు ఎంజిఆర్‌.

తెలుగు రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పిన మ‌హానుభావుడు నంద‌మూరి తార‌క‌రామారావు ఆయ‌న‌ను ముద్దుగా (ఎన్‌టీఆర్‌) ని పిలుచుకుంటారు. ఎన్‌టీఆర్ ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్‌… ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడు. 1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు. ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించారు.97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల్లో మ‌ట్టిక‌రిపించి సీఎం అయ్యారు.

ఇక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అందరూ వైఎస్సార్ అని వైఎస్ అనే పిలుస్తారు. అదే పద్దతిలో తనను కూడా ఇకనుండి అందరితో జెఎంఆర్ అని పిలిపించుకోవాలనే జగన్, సారీ జెఎంఆర్ డిసైడ్ అయ్యారట. మరో మూడు రోజుల్లో ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమవుతున్న విషయం అందరకీ తెలిసిందే.

ఇక తెలంగాణా సీఎం పేరు కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు ఆయ‌న‌ను కూడా ముద్దుగా (కేసీఆర్‌) అని పిలుచుకుంటారు. 14 సంవ‌త్స‌రాల‌పాటు ప్ర‌త్యేక తెలంగాణాకోసం పోరాడి చివ‌రికి సాధించిన గొప్ప వ్య‌క్తి కేసీఆర్‌. వీరంద‌రి పేర్లుకూడా సింపుల్‌గా మూడ క్ష రాల‌తోనె పిలుచుకుంటారు. మూడ‌క్ష‌రాల పేర్ల‌తో ఉన్న నాయ‌కులంతా సీఎంలు అయ్యి అద్భుతంగా ప‌రిపాల‌న సాగించారు. మ‌రి జ‌గ‌న్‌కూడా ఇప్పుడు పేరుప‌ల‌క‌డంలో జేఎమ్ఆర్‌గా మార్పు చేసుకున్నారు. మ‌రి సీఎం క‌ల నెర‌వేరుతాదో లేదో భ‌విష్య‌త్తులో తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -