Saturday, May 18, 2024
- Advertisement -

జగన్‌కి పచ్చకళ్ళ నైజం తెలిసిపోయిందా? యుద్ధానికే జై కొట్టాడా?

- Advertisement -

కుల రాజకీయాలు…. రాష్ట్రంలో వైషమ్యాలు పెంచడం…అందరి మధ్యా విభేదాలు, వైరుద్యాలు పెంచేలా చేయడం చంద్రబాబు నైజం. అయితే అవన్నీ కూడా వైఎస్‌లపైకి నెట్టే ప్రయత్నంలో బాబుతో పాటు ఆయన కుల మీడియా కూడా విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే వైఎస్ జగన్ మాత్రం వీలైనంత వరకూ సంయమనం పాటించే ప్రయత్నమే చేస్తున్నాడు. ఆ విషయం పాదయాత్ర సందర్భంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే తేల్చిచెప్తున్నాయి. కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లా చేస్తానన్నాడు. మొదటి నుంచీ కూడా ఏ కులంతోనూ పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనిపించడం కానీ……లేకపోతే కులాల మధ్య వైషమ్యాలు పెంచి అధికారంలోకి రావాలని కాని జగన్ ప్రయత్నాలు చేసినట్టుగా కనిపించదు.

ఇక ఏ కులం నాయకుడిని ఆ కులం నాయకుడితో తిట్టించాలనే చంద్రబాబు ఫార్ములా కూడా జగన్ ఫాలో అవ్వడం లేదు. అలాగే మైనారిటీలతో సహా అందరు మతస్తులతోనూ జగన్‌కి సత్సంబంధాలే ఉన్నాయి. అయినప్పటికీ బిజెపితో తెగదెంపులు చేసుకున్న వెంటనే జగన్‌కి ఇక ఒక్క ముస్లిం ఓటు కూడా పడదు అనేలా ముస్లిములను జగన్‌కి దూరం చేయాలన్న కుట్ర పూరిత చంద్రబాబు వ్యూహాలను జగన్ ఎప్పుడూ అనుసరించలేదు. కులాలు, మతాల రాజకీయం చేసి ఇలాంటి చంద్రబాబును ఆయన మీడియా ఆకాశానికెత్తుతూ ఉంటుంది.

అయినప్పటికీ తెలుగు జర్నలిజంలో సీనియర్ అయిన రామోజీతో కూడా సత్సంబంధాలే కావాలనుకున్నాడు జగన్. తెలుగునాట కాస్త సంయమనపూరిత వాతావరణం ఉండాలనుకున్నాడు. అందుకే తనే కాస్త తగ్గి వ్యక్తిగతంగా రామోజీని కలిశాడు. అయితే వంకర వ్యవహారాలు ఎప్పుడూ వంకరగానే ఉంటాయి అన్నట్టుగా రామోజీ మాత్రం అసలు నైజం బయటపెట్టేసుకున్నాడు. అందుకే ఇప్పుడు జగన్ కూడా పచ్చ బ్యాచ్ మొత్తంతో అదే స్థాయి రాజకీయాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఎన్నికల ఏడాదిలో రామోజీతో సహా బాబు భజన మీడియా మొత్తం జగన్‌పై వ్యతిరేక వార్తలు, బాబు భజన మీడియా వార్తలతో శివాలెత్తిపోవడం ఖాయం అని అర్థం చేసుకున్న జగన్ తాను కూడా అదే స్థాయి వ్యూహాలు రచిస్తున్నాడని తెలుస్తోంది. అందుకే చాలా కాలం తర్వాత మొదటి సారి పశ్ఛిమ గోదావరి జిల్లాలో రామోజీని కూడా డైరెక్ట్‌గా ఎటాక్ చేశాడు జగన్. జగన్ ఎంచుకున్న ఈ వ్యూహమే వైకాపా శ్రేణులకు కూడా ఉత్సాహాన్ని ఇస్తోంది. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ నుంచి కూడా పచ్చ బ్యాచ్ తోకలు ఎప్పుడూ వంకరేనని……..వాళ్ళతో సంయమనం కంటే వ్యూహాత్మకంగా ఎధురుదాడి చేయడమే మంచిదని వైకాపాలో ఎక్కువ మంది నాయకులు అభిప్రాయపడుతుండడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -