Monday, May 20, 2024
- Advertisement -

ఆప్ఘాన్ సెమీస్ చేరాలంటే!

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదుచేసింది ఆప్ఘానిస్తాన్. ఈ దెబ్బతో ఆప్ఘాన్‌ సెమీస్ అవకాశాలు మెరుగుపడగా పాక్‌కు సంక్లిష్టంగా మారింది. ఆప్ఘాన్‌ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందగా. సెమీఫైనల్‌కు చేరాలంటే.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాలి. ఒకవేళ ఓడినా మిగితా జట్ల ఓటమిపై ఆధారపడి ఉంటుంది.

నెదర్లాండ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కాబూలీలు సత్తాచాటి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. నెదర్లాండ్స్ విధించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఆప్ఘాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కొల్పోయి 181 చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది (56), రహ్మత్‌ షా (52), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (31) సత్తా చాటడంతో ఆఫ్ఘాన్ గెలుపొంది రన్‌రేట్ మెరుగు పర్చుకోగా తొలిసారి ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధించింది.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఇంగిల్‌బెర్త్‌ (58), మ్యాక్స్‌ ఓ డౌడ్‌ (42) మాత్రమే రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కావడంతో నెదర్లాండ్స్ భారీ స్కోరు సాధించలేకపోయింది. నబీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -