Sunday, May 19, 2024
- Advertisement -

ట్యాంప‌రింగ్ వివాదంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్‌…

- Advertisement -

ఆస్ట్రేలియా క్రికెట్‌ సారథి స్టీవ్‌ స్మిత్‌ బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. సిడ్నీలో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో స్మిత్‌ బంతిని టాంపరింగ్‌ చేస్తూ దొరికిపోయాడు. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చేసే సమయంలో బంతి అందుకున్న స్మిత్‌ తన పెదవులకు ఉన్న లిప్‌ బామ్‌ను బంతికి పూశాడు. ఇది వీడియోలో రికార్డు కావడంతో స్మిత్‌పై విశ్లేషకులు మండిపడుతున్నారు.

మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే దీనిపై కామెంట్లు వినిపించగా, మ్యాచ్ అనంతరం స్మిత్ బాల్ ను ట్యాంపర్ చేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్మిత్ వివరణ ఇస్తూ, తానేమీ బాల్ ను ట్యాంపర్ చేయలేదని, తనపై అనవసరంగా ఆరోపణులు చేస్తున్నారని అన్నాడు. తన పెదవులపై అప్పుడు లిప్ బామ్ లేదని తెలిపాడు.

ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్ ల సిరీస్ ను 0-3తో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మూడో వన్డేలో ఆస్ట్రేలియా 16 పరుగుల తేడాతో ఓటమి చవిచూసి సిరీస్‌ను ఇంకా రెండు వన్డేలు ఉండగానే చేజార్చుకుందిమూడో మ్యాచ్ లో నిదానంగా బౌలింగ్ వేయించినందుకు స్మిత్ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోతను విధిస్తున్నట్టు అంపైర్లు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -