Saturday, May 4, 2024
- Advertisement -

క్రికెట్‌లో బెట్టింగ్ మాఫియాను అరిక‌ట్టేందుకు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ఐసీసీ

- Advertisement -

బెట్టింగ్ మ్యాఫియా అన్ని రంగాల‌ను ప‌ట్టి పీడిస్తోంది. ఎక్కువ‌గా క్రీడ‌ల్లో ఈ బెట్టింగ్ మాఫియా మూడు పూవ్వులు ఆరుకాయ‌లుగా సాగుతోంది. ఇక క్రికెట్‌లో అయితే చెప్పాల్సిన ప‌నిలేదు. అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు అయినా, లీగ్ మ్యాచ్‌లు అయినా స‌రే బెట్టింగ్ మాత్రం జ‌రుగుతోంది. ఐసీసీ బెట్టింగ్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అవి ఫ‌లించ‌లేదు. దీంతో క్రికెట్‌లో దీన్ని అరిక‌ట్టేందుకు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఫిక్స్‌ంగ్‌ను తరిమికొట్టేందుకు ఇంటర్‌ పోల్‌తో కలసి పనిచేయాల‌ని నిర్ణ‌యించింది. ఫ్రాన్స్‌లోని లియోన్‌లో ఉన్న ఇంటర్‌పోల్‌ అధికారులతో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ సమావేశమై చర్చించినట్లు ఐసీసీ ఓ లేఖలో వెల్లడించింది. అంత‌ర్జాతీయంగా నేరాల‌ను అరిక‌ట్టేందుకు ఇంట‌ర్ పోల్ 194 దేశాలతో క‌ల‌సి ప‌నిచేస్తోంది. దీనివల్ల క్రికెట్‌ వ్యవహారాల్లో అవినీతి, ఫిక్స్‌ంగ్‌ జాఢ్యాలను పూర్తిగా నియంత్రించేందుకు వీలవుతుంది’అని ఆ లేఖలో పేర్కొంది. ఫిక్సింగ్‌ వ్యవహారాల నియంత్రణకు ఐసీసీతో కలసి పనిచేయనున్నం దుకు సంతోషంగా ఉంద‌ని ఇంటర్‌పోల్‌ క్రిమినల్‌ నెట్‌వర్క్‌ యూనిట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోస్‌ డి గ్రేసియా తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -