Tuesday, May 21, 2024
- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లండ్ బోని…చిత్తు చిత్తుగా ఓడిన స‌ఫారీలు

- Advertisement -

ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు స‌ఫారీల‌పై ఘన విజయం సాధించింది విజ‌యంతో మొద‌టి బోణీ కొట్టింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 104 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్‌.. సఫారీ జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది.

కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ (89: 79 బంతుల్లో 9×4), ఇయాన్ మోర్గాన్ (57: 60 బంతుల్లో 4×4, 3×6), జేసన్ రాయ్ (54: 53 బంతుల్లో 8×4), జోరూట్ (51: 59 బంతుల్లో 5×4) అర్ధశతకాలు బాదడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. చివర్లో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌ను సఫారీ బౌలర్లు కట్టడి చేయడంతో ఇంగ్లండ్ స్కోరు 311 పరుగుల వద్ద ఆగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీసుకోగా, ఇమ్రాన్ తాహిర్, కగిసో రబడ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. పెహ్లుక్వాయోకు ఓ వికెట్ దక్కింది.

312 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌కు దిగిన స‌ఫారీలు 9.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (68), డుసెన్ (50) మాత్రమే అర్ధ సెంచరీలు చేశారు. ఆరంభంలోనే హషీమ్‌ ఆమ్లా (13) హెల్మెట్‌ గ్రిల్స్‌కు బంతి బలంగా తాకడంతో రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. మార్కమ్‌ (11)ను ఔట్‌ చేసి జోఫ్రా ఆర్చర్‌ వికెట్ల వేటను ఆరంభించాడు. సఫారీ సారథి డుప్లెసిస్‌ (5)నూ అతడే పెవిలియన్‌ పంపించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. మిగితా బ్యాట్స్ మేన్‌లు ఎవ‌రూ రాణించ‌క‌పోవ‌డంతో ఘోర ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంది.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ 3 వికెట్లు తీసుకోగా, ప్లంకెట్, బెన్ స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అదిల్ రషీద్, మొయిన్ అలీలకు చెరో వికెట్ దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -