Thursday, May 2, 2024
- Advertisement -

భార‌త్‌తో మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికాకు మ‌రో ఎదురు దెబ్బ‌..

- Advertisement -

ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్‌లో స‌ఫారీల‌కు కాలం క‌ల‌సి రావ‌ట్లేదు. వ‌రుస‌గా రెండు ఓట‌ముల‌తో కుదేల‌యిన సౌతాఫ్రికాకు ఇప్పుడు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే గాయాల‌తో స్టార్ ఆట‌గాళ్లు జ‌ట్ట‌కు దూర‌మవుతున్నారు. భార‌త్‌తో మ్యాచ్‌కు ముందు ఎదురు దెబ్బ తగిలింది. భుజం కారణంగా పేసర్ డేల్ స్టెయిన్ వరల్డ్ కప్‌ నుంచి వైదొలిగాడు. ఇది ఆజ‌ట్టుపై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది.

సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పిన స్టెయిన్‌ను మూడేళ్లుగా భుజం గాయం వేధిస్తోంది. 2016లో అతడి భుజానికి శస్త్రచికిత్స జరిగినప్పటికీ.. గాయం పదే పదే తిరగబెడుతోంది. వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా.. తర్వాతి మ్యాచ్‌లో అనూహ్యంగా బంగ్లా చేతిలో ఓటమిపాలైంది. బుధ‌వారం భార‌త్ జ‌రిగే మ్యాచ్‌లో ఖ‌శ్చితంగా స‌ఫారీలు గెల‌వాల్సిందే. లేకుంటే ఆజ‌ట్టు సెమీస్‌కు వెల్ల‌డం అంత సులువు కాదు.

ఎడమ కాలి గాయం కారణంగా లుంగి ఎంగిడి కూడా భారత్‌‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. కోహ్లి సేనతో మ్యాచ్‌కల్లా స్టెయిన్ ఫిట్ అవుతాడని భావించినప్పటికీ.. అతడు ఏకంగా వరల్డ్ కప్‌కి దూరం కావడం సౌతాఫ్రికాకు ఓ రకంగా షాక్ అనే చెప్పొచ్చు. స్టెయిన్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బ్యూరాన్ హెండ్రిక్స్‌ను జట్టులోకి తీసుకున్నారు. గంటకు 140 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అతడి సొంతం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -