Thursday, May 2, 2024
- Advertisement -

ఇంటిబాట ప‌ట్టిన స‌ఫారీలు…పాక్ సెమీస్ ఆశ‌లు స‌జీవం

- Advertisement -

భార‌త్‌తో జురిగిన మ్యాచ్‌లో పాక్‌పై ఘోరంగా ఓడిపోవ‌డంతో అన్ని వైపుల‌నుంచి వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టింది పాక్‌.ఆదివారం లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 309 పరుగుల లక్ష్యఛేదనలో సఫారీలను 259/9 కే కట్టడి చేసింది.పాకిస్థాన్ బౌలర్లలో వహాబ్ రియాజ్, షాదాబ్ ఖాన్ అద్భుతమైన స్పెల్ తో ఆకట్టుకున్నారు.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హరిస్‌ సొహైల్‌ (59 బంతుల్లో 89; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), బాబర్‌ ఆజమ్‌ (80 బంతుల్లో 69; 7 ఫోర్లు) రాణించారు. తొలి వికెట్ కు ఓపెనర్లు ఇమాముల్ హక్ (44), ఫఖార్ జమాన్ (44) జోడీ 81 పరుగులు జోడించడంతో పాక్ భారీ స్కోరు దిశగా పయనించింది. మిడిలార్డర్ లో సొహైల్, అజామ్ కూడా కదంతొక్కడంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసి ఓడింది. డుప్లెసిస్‌ (79 బంతుల్లో 63; 5 ఫోర్లు), డికాక్‌ (60 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.

ఈ ఓటమితో దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. సెమీస్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్ గెలవాలన్న స్థితిలో పాక్ తో మ్యాచ్ ఆడిన సఫారీలకు ఈ ఓటమితో అన్ని అవకాశాలు మూసుకుపోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -