Sunday, May 19, 2024
- Advertisement -

భార‌త్‌కు మ‌రో స్వ‌ర్ణం…చ‌న్న‌వ‌య‌స్సులోనే చ‌రిత్ర సృష్టించిన టీనేజ‌ర్‌

- Advertisement -

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ షూటర్లు స్వర్ణాలు పంట పండిస్తున్నారు. శుక్రవారం ఉదయం మహిళల 50 మీటర్ల రైఫిల్ విభాగంలో తేజస్వినీ సావంత్ బంగారు పతాకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ విభాగంలో టీనేజ్ సంచలనం అనీశ్ భన్వాలా (15) స్వర్ణం సాధించాడు. అంతేకాదు అత్యంత పిన్న వయసులోనే కామన్వెల్త్‌లో స్వర్ణం సాధించిన భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. దీంతో 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన 15 స్వర్ణాల సంఖ్యను అధిగమించింది.

అనీశ్ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న మొదటి సారే స్వర్ణం గెలవడం విశేషం. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డులు -2017లో వర్దమాన క్రీడాకారుడు అవార్డును అనీశ్ అందుకున్నాడు. గురువారం జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్‌లో 6 వ స్థానంలో నిలిచి, ఫైనల్‌కు అర్హత సాధించిన అనీశ్…
ఫైనల్లో తన కంటే సీనియర్లను వె

మొత్తం 30 పాయింట్లు సాధించి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఒక దశలో ఆస్ట్రేలియా షూటర్ సెర్గయ్ ఇవాంగ్లెవిస్కీ (20), ఇంగ్లాండ్ షూటర్ శామ్ గోవిన్ (28) గట్టి పోటీ ఇచ్చారు. అయితే అనీష్ మాత్రం తన దృష్టిని అగ్రస్థానంపై ఉంచాడు. ఎనిమిదో రౌండ్ పూర్తయ్యేసరికి అగ్రస్థానానికి చేరుకున్న టీనేజ్ సంచలనానికి అక్కడ నుంచి ఎదురులేకుండా పోయింది. ఈ విభాగంలో ఆస్ట్రేలియా షూటర్ సెర్గయ్ రజతం, ఇంగ్లాండ్ షూటర్ శామ్ గోవిన్ కాంస్య పతకాలు గెలుపొందారు. ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత షూటర్లు నీరజ్ కుమార్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

క్వాలిఫైయింగ్ రౌండ్‌లో అనీశ్ కంటే మెరుగైన స్కోరు సాధించినా, ఫైనల్‌లో మాత్రం వెనుకబడిపోయాడు. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న తొలిసారే స్వర్ణం సాధించిన టీనేజ్ సంచలనం ముందు ముందు అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిభను నిరూపించుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -