Sunday, May 19, 2024
- Advertisement -

కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ర‌జ‌తంతో భార‌త్ బోణి

- Advertisement -

ప్ర‌తిష్టాత్మ‌క కామన్వెల్త్‌ గేమ్స్ ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో బుధ‌వారం (ఏప్రిల్ 4) ప్రారంభోత్స‌వం జ‌రగ్గా గురువారం (ఏప్రిల్ 5) నుంచి క్రీడా పోటీలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన క్రీడా పోటీల్లో భారత్‌ పతకాల పంట‌కు ఖాతా తెరిచింది. కామ‌న్వెల్త్‌లో భార‌త్ ప్ర‌తిసారి పెద్ద ఎత్తున ప‌త‌కాలు సాధిస్తుంటుంది. ఆ కోటాలో ఈ యేడు కూడా ఆ విధంగానే అంచ‌నాలు ఉన్నాయి. దానికి బోణి వెయిట్ లిఫ్టింగ్ నుంచి ల‌భించింది.

వెయిట్‌లిఫ్టింగ్‌ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకం సాధించి భార‌త ప‌త‌కాల ఖాతా తెరిచాడు. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచాడు. 261 కిలోల బరువును ఎత్తిన మలేసియా వెయిట్‌ లిప్టర్‌ మహ్మద్‌ ఇజార్‌ అహ్మద్ బంగారు ప‌త‌కం సాధించగా, శ్రీలంక లిఫ్టర్‌ లక్మల్‌ 248 కేజీల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

21వ కామన్వెల్త్ గేమ్స్ 12 రోజుల పాటు కొన‌సాగ‌నున్నాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో మొత్తం 6,600 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -