Saturday, May 4, 2024
- Advertisement -

ఫైన‌ల్లో ఓడినా చ‌రిత్ర సృష్టించిన సింధు …

- Advertisement -

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కిన పీవీ సింధు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో వరల్డ్ నంబర్ చైనీస్ తైపీ ప్లేయర్ తై జు యింగ్‌తో 13-21, 16-21 తేడాతో సింధును ఓడించింది. దీంతో ఏషియాడ్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారత షట్లర్‌గా నిలిచే అవకాశాన్ని సింధు కోల్పోయింది. ఫైన‌ల్లో ఓడి ర‌జ‌తంతో స‌రిపెట్టుకుంది.

వరుస రెండు గేమ్‌లను తై జు యింగ్‌కు సునాయాసంగా కోల్పోయిన సింధు.. మరొకసారి ఫైనల్‌ ఫోబియాను అధిగమించలేకపోయింది. తద్వారా 2016 రియో ఒలింపిక్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో చివరిసారి తై జు యింగ్‌ని ఓడించిన సింధు ఆ తర్వాత ఆమెతో ఆడిన వరుస ఆరు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైనట్లయ్యింది.

సోమవారం జరిగిన సెమీస్‌లో జపాన్‌కు చెందిన యమగుచిపై 21-17, 15-21, 21-10 తేడాతో సింధు విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఏషియాడ్ ఫైనల్ చేరిన తొలి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా తెలుగు తేజం చరిత్ర సృష్టించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -